SonyLIV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో యాడ్ ఆన్ ప్యాక్‌ను ప్రకటించిన వీఐ

ABN , First Publish Date - 2022-05-11T02:19:41+05:30 IST

వీఐ (Vodafone Idea) మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. 28 రోజుల కాలపరిమితి, సోనిలివ్ మొబైల్ ఓన్లీ సబ్‌స్క్రీప్షన్‌తో

SonyLIV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో యాడ్ ఆన్ ప్యాక్‌ను ప్రకటించిన వీఐ

న్యూఢిల్లీ: వీఐ (Vodafone Idea) మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. 28 రోజుల కాలపరిమితి, సోనిలివ్ మొబైల్ ఓన్లీ సబ్‌స్క్రీప్షన్‌తో రూ. 82 ప్రీపెయిడ్ యాడ్ ఆన్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. వీఐ ఇప్పటికే వీఐ మూవీస్, టీవీ  సబ్‌స్క్రిప్షన్‌ను ప్రీపెయిడ్ యూజర్లకు అందిస్తోంది. దీని ద్వారా న్యూస్ చానళ్లతో సహా 450కిపైగా లైవ్ టీవీ చానళ్లను వీక్షించవచ్చు. 


తాజా ప్లాన్ విషయానికి వస్తే సోనీలివ్ ప్రీమియం యాక్సెస్ ద్వారా స్పోర్ట్స్ స్ట్రీమ్స్ అయిన యూఈఎఫ్ఏ (UEFA) చాంపియన్స్ లీగ్, డబ్ల్యూడబ్ల్యూఈ (WWE), బండెస్‌లిగా, యూఎఫ్‌సీతోపాటు ‘స్కామ్ 1992’, మహరాణి, గుల్లక్ సీజన్ 3 వంటి ఒరిజినల్స్‌ను కూడా వీక్షించొచ్చు. అలాగే, గుడ్ డైరెక్టర్, ఫాంటసీ ఐలాండ్, మాగ్‌పీ మర్డర్స్ వంటి అంతర్జాతీయ షోలను కూడా చూడొచ్చు.


అయితే, ఈ సబ్‌స్క్రిప్షన్ మొబైల్స్‌కు మాత్రమే పరిమితం. టీవీ వంటి ఇతర సాధనాల ద్వారా వీక్షించడం కుదరదు. ఈ ప్యాక్‌లో 4 జీబీ హైస్పీడ్ డేటా 14 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. కాగా, సోనీలివ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కావాలంటే మాత్రం నెలకు రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది. 

Read more