అద్భుతమైన ఆఫర్ ప్రకటించిన VI.. ఆ ప్యాక్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Published: Tue, 24 May 2022 19:47:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అద్భుతమైన ఆఫర్ ప్రకటించిన VI.. ఆ ప్యాక్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

న్యూఢిల్లీ: వీఐ (Vodafone Idea) మరో బ్రహ్మాండమైన ఆఫర్‌తో వచ్చేసింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 151తో యాడ్ ఆన్ ప్యాక్ ప్రకటించింది. ఈ ప్యాక్‌తో డిస్నీప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలపాటు ఉచితంగా లభిస్తుంది. 30 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్యాక్‌లో 8జీబీ డేటా లభిస్తుంది.


వీఐ ఇటీవల రూ. 82 యాడ్ ఆన్ ప్యాక్‌ తీసుకొచ్చింది. 4జీబీ డేటా 14 రోజుల కాలపరిమితితో లభించే ఈ ప్యాక్‌తో 28 రోజులపాటు సోనిలివ్ (SonyLiv) మొబైల్ యాక్సెస్‌ లభిస్తుంది. తాజాగా, రూ. 151 ప్యాక్ ప్రకటించింది. తాజా ప్లాన్‌తో ఐపీఎల్‌ను కూడా వీక్షించొచ్చు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.