స్నేహితుల సలహాతో వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. చివరకు అతని పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-06-08T19:00:36+05:30 IST

శృంగారాన్ని ఎక్కువ సమయం పాటు ఆస్వాదించేందుకు, అంగ స్తంభన సమస్యలను అధిగమించేందుకు వయాగ్రా మాత్రలను వాడుతుంటారు.

స్నేహితుల సలహాతో వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. చివరకు అతని పరిస్థితి ఏమైందంటే..

శృంగారాన్ని ఎక్కువ సమయం పాటు ఆస్వాదించేందుకు, అంగ స్తంభన సమస్యలను అధిగమించేందుకు వయాగ్రా మాత్రలను వాడుతుంటారు. చాలా మంది నేరుగా మెడికల్ షాప్‌నకు వెళ్లి వీటిని కొనేస్తుంటారు. కానీ, డాక్టర్ల సలహాతోనే వీటిని వాడాల్సి ఉంటుంది. మోతాదు ఏ మాత్రం ఎక్కువైనా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కొత్త పెళ్లి కొడుకు అధిక మోతాదులో వయాగ్రా ట్యాబ్లెట్లు వాడి తన కాపురం మీదకు తెచ్చుకున్నాడు. రెండుసార్లు శస్త్రచికిత్స చేసినా అతని పరిస్థితి మెరుగుపడలేదు. 


ఇది కూడా చదవండి..

నువ్వే నా ప్రాణం అంటూ ఇంట్లోంచి వచ్చేసి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి.. రెండ్రోజుల్లోనే షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ యువకుడికి నెల రోజుల క్రితమే పెళ్లయింది. అతనికి ఎలాంటి శృంగార సమస్యలూ లేవు. కానీ, శృంగారాన్ని ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే వయాగ్రా మాత్రాలు వేసుకోవాలని స్నేహితులు ఉచిత సలహాలు ఇచ్చారు. వారి మాటలను నమ్మిన ఆ యువకుడు రోజూ వయాగ్రా మాత్రలు వేసుకొని భార్యతో శృంగారంలో పాల్గొనేవాడు. ఎంత ఎక్కువ డోస్ వేసుకుంటే అంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనవచ్చని భావించాడు. రోజులు గడిచే కొద్ది మోతాదు పెంచుకుంటూ పోయాడు. రోజుకు 50 మిల్లీ గ్రాముల వరకు మాత్రమే వయాగ్రా మాత్రలు వేసుకోవచ్చు. అలాంటిది అతడు ఏకంగా 200 మి.గ్రా. డోసేజ్ తీసుకునే వరకు వెళ్లాడు. అలా 20 రోజుల పాటు తీసుకున్నాడు. 


వయాగ్రా మాత్రల మోతాదు మించడంతో అతనికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అతడి అంగం గంటల తరబడి స్తంభించే ఉండిపోయేది. భర్త తీరుతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. చివరకు అతను ఆస్పత్రిలో చేరాడు. వయాగ్రా వల్ల అతడిలో `ప్రియపిజం` సమస్య తలెత్తిందని అతడిని పరీక్షించిన వైద్యులు గుర్తించారు. ప్రయపిజం అంటే అంగం మొత్తబడకుండా.. అలాగే స్తంభించి ఉండడం. అతడి అంగాన్ని సరిచేసేందుకు డాక్టర్లు రెండుసార్లు శస్త్ర చికిత్స చేశారు. అయినా అతడి అంగ పరిమాణం మాత్రం తగ్గలేదు. శృంగారంలో పాల్గొనడంలోనూ, పిల్లలు పుట్టడంలోనూ అతనికి ఎలాంటి సమస్యలూ ఉండవని, అయితే అతడి అంగ పరిమాణం మాత్రం పెద్దగానే ఉంటుందని వైద్యులు చెప్పారు. 


Updated Date - 2022-06-08T19:00:36+05:30 IST