వైభవంగా వెంగమాంబ 16 రోజుల పండుగ

ABN , First Publish Date - 2022-07-08T02:45:06+05:30 IST

మండలం నర్రవాడ వెంగమాంబ పేరంటాళ్ల 16 రోజుల పండుగ గురువారం వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాక

వైభవంగా వెంగమాంబ 16 రోజుల పండుగ
ప్రత్యేక అలంకరణలో వెంగమాంబ, గురవయ్యనాయుడు దంపతులు

 నర్రవాడకు పోటెత్తిన భక్తులు

దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ పేరంటాళ్ల 16 రోజుల పండుగ గురువారం వైభవంగా జరిగింది. జిల్లా  నలుమూలల నుంచే కాక  ప్రకాశం, కడప జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి పొంగళ్లు నిర్వహించి నైవేథ్యం అందజేశారు. వాహనాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్తలు పచ్చవ కరుణాకర్‌బాబు, వెంకటేశ్వర్ల్లు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు రేణుకాఎల్లమ్మ దేవాలయ ట్రస్టు తరపున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. 

                                                         - దుత్తలూరు




Updated Date - 2022-07-08T02:45:06+05:30 IST