నేడు Hyderabadకు ఉపరాష్ట్రపతి రాక

ABN , First Publish Date - 2022-06-20T12:52:34+05:30 IST

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నేడు Hyderabadకు ఉపరాష్ట్రపతి రాక

రెండు రోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఉపరాష్ట్రపతి సోమవారం సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లై ఓవర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు ద్వారా రోడ్‌ నెంబర్‌ 29లోని నివాసానికి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 6.20 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌, ప్రకాశ్‌నగర్‌ ఫ్లైఓవర్‌, రసూల్‌పురా సీటీఓ మీదుగా పరేడ్‌గ్రౌండ్‌ చేరుకుంటారు.

7.30 గంటలకు కార్యక్రమం ముగిసిన తర్వాత పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లై ఓవర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు ద్వారా నివాసానికి చేరుకుంటారు. యోగా కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హాజరవుతున్నందున పరేడ్‌గ్రౌండ్‌ పరిసరాల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని రంగనాథ్‌ తెలిపారు. తిరుమలగిరి, బోయిన్‌పల్లి, టివోలి క్రాస్‌రోడ్స్‌, సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌, బేగంపేట్‌, ప్యారడైజ్‌, జేబీఎస్‌, కార్ఖానా, వైఎంసీఏ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలతోపాటు మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-20T12:52:34+05:30 IST