ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-31T02:08:38+05:30 IST

ఒక్కోసారి కొన్ని పనులు.. ఏ శ్రమ లేకుండానే చకచకా జరిగిపోతుంటాయి. అలాగే భారీ చోరీలు జరిగినప్పుడు ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఆధారాలు దొరకవు. అలాంటి కేసులు.. అటు బాధితులతో పాటూ ఇటు పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా..

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఒక్కోసారి కొన్ని పనులు.. ఏ శ్రమ లేకుండానే చకచకా జరిగిపోతుంటాయి. అలాగే భారీ చోరీలు జరిగినప్పుడు ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఆధారాలు దొరకవు. అలాంటి కేసులు.. అటు బాధితులతో పాటూ ఇటు పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. తమిళనాడులో ఓ కేసు ఎలాంటి కష్టం లేకుండానే పరిష్కారమైంది. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా గోపాలపట్నం గ్రామంలో జవహర్ సాధిక్ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం భారీ చోరీ జరిగింది. దొంగలు తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడి 687 సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు చోరీ జరిగిందని తెలుసుకున్న బాధితులు.. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం డీఐజీ కూడా బాధితుడి ఇంటిని సందర్శించారు. దీంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. అయితే నిందితులకు సంబంధించిన ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు బాధితులకు ఓ సలహా ఇచ్చారు.

చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్.. బాలికలతో ఏం చేయించిస్తున్నారో తెలుసా.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..


తలుపులు బద్దలు కొట్టేందుకు దొంగలు ఉపయోగించిన ఇనుప రాడ్డు దొరికితే కేసును సులభంగా ఛేదించవచ్చని సూచించారు. దీంతో ఆ రాడ్డు కోసం బాధితులు కూడా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఓ బావిలో వెతికారు. ఇందుకోసం బావిలోని నీటినంతా బయటికి తోడారు. చివరగా వారికి ప్లాస్టిక్ కవర్ మూట కనిపించింది. దాన్ని బయటికి తీసుకొచ్చి తెరచిచూడగా.. ఆశ్చర్యంగా తమ నగలన్నీ అందులో ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి గురైన నగలన్నీ ఎట్టకేలకు దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తమ నగలన్నీ దొరకడంతో బాధితులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..

Updated Date - 2021-12-31T02:08:38+05:30 IST