విదార్థ్‌ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

Published: Tue, 05 Jul 2022 18:22:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విదార్థ్‌ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

కోలీవుడ్ లో ‘యధార్థ నాయకన్‌’ గా గుర్తింపు పొందిన విదార్థ్‌ (Vidarth) హీరోగా రూపుదిద్దుకునే కొత్త చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. గ్రీనిటివ్‌ ఫిలిమ్స్‌ (Greenitiv Films) బ్యానరులో ‘ప్రొడక్షన్స్‌ 1’గా తెరకెక్కే చిత్రాన్ని ఆర్‌.మోహన్‌ రాకేష్‌ (R Mohan Rakesh) నిర్మిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్‌ మణిమారన్‌ నటరాజన్‌ (Manimaran Natarajan) దర్శకత్వం వహిస్తుండగా. కథ, స్ర్కీన్‌ప్లే, మాటలను శ్రీనివాసన్‌ సుందర్‌ (Srinivasan sundar) సమకూర్చుతున్నారు. కెమెరా ఎస్‌.ఆర్‌.సతీష్‌ కుమార్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు మంచి ప్రాముఖ్యత ఉండటంతో సంగీత దర్శకుడిగా ‘వలిమై’ ఫేం జిబ్రాన్‌ (Jibran) ను ఎంపిక చేశారు. హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 


చెన్నై నగరంలో జరిగిన ఈ చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్‌ అధికారి నందకుమార్‌, దర్శకుడు కార్తీక్‌ సుందర్‌, సర్గుణం, రాంనాథ్‌ పళనికుమార్‌, దాస్‌ రామస్వామి, అశోక్‌ కుమార్‌, ఎన్‌.రాఘవన్‌ తదతర పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది ‘ఎండ్రావదు ఒరునాల్(Endravathu Orunal) , అన్బరివు (Anbarivu), కార్బన్’ (Carbon) లాంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్న విదార్ధ్.. ఈ ఏడాది ‘గమనిగల్ గమనిక్కవు’  (Gaminigal Gamanikkavu) చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ సినిమాతో విదార్ధ్ ఇంకే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International