Viral video: మనుషులతో పోటీ పడి పుషప్స్ తీస్తున్న ఎలుగుబంటి.. అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-03-10T02:10:06+05:30 IST

మనుషులను అనుకరించే కోతి, చింపాంజి తదితర జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ తారసపడుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా..

Viral video: మనుషులతో పోటీ పడి పుషప్స్ తీస్తున్న ఎలుగుబంటి.. అవాక్కవుతున్న నెటిజన్లు..

మనుషులను అనుకరించే కోతి, చింపాంజి తదితర జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ తారసపడుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొన్ని జంతువులు అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ ఎలుగుబంటి మనుషులతో పోటీ పడి పుషప్స్ తీయడం.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


సర్టిఫైడ్ వాకబోన్ అనే యూజర్.. తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. మంచుతో నిండిన ఓ అడవిలో ఇద్దరు వ్యక్తులు పుషప్స్ తీస్తూ ఉంటారు. ఓ వ్యక్తి చెట్టు కొమ్మ పట్టుకుని పుషప్స్ తీస్తుంటే.. మరో వ్యక్తి బాక్సింగ్ గ్లౌవ్స్ తొడుక్కుని ఆ వ్యక్తి కడుపు మీద కొడుతూ ఉంటాడు. ఇదంతా ఓ ఎత్తైతే.. అటు పక్కనే ఓ ఎలుగుబంటి మరో కొమ్మను పట్టుకుని పుషప్స్ తీయడం చూడొచ్చు. ‘‘మీ కంటే నేనేం తక్కువ కాదు’’.. అన్నట్లుగా వారితో సమానంగా ఆ ఎలుగు బంటి పుషప్స్ తీయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ఎలుగు బంటికి ఆరోగ్య సూత్రాలు బాగా తెలిసినట్టు ఉన్నాయే’’.. అంటూ చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..

బస్సు రన్నింగ్‌లో ఉండగా.. సడన్‌గా స్పృహ తప్పిన డ్రైవర్.. అంతా భయాందోళనలో ఉండగా ఓ మహిళ పైకి లేచి..





Updated Date - 2022-03-10T02:10:06+05:30 IST