Viral video: వామ్మో.. ఇదెక్కడి చింపాంజిరా బాబూ.. మనిషి చేసినట్లే చేస్తోంది..!

ABN , First Publish Date - 2021-10-11T00:55:21+05:30 IST

చింపాంజీలు, గొరిల్లాల నుంచే మానవ జాతి ఆవిర్భవించిందనేది వాస్తవం. చింపాంజీలు చాలా తెలివైన జంతువులు. ఇవి మానవులను సైతం అనుకరించగలవు. మనుషులు, చింపాంజీల డీఎన్‌ఏలో 98.8 శాతం ఒకే లక్షణాలు ఉంటాయట.

Viral video: వామ్మో.. ఇదెక్కడి చింపాంజిరా బాబూ.. మనిషి చేసినట్లే చేస్తోంది..!

చింపాంజీలు, గొరిల్లాల నుంచే మానవ జాతి ఆవిర్భవించిందనేది వాస్తవం. చింపాంజీలు చాలా తెలివైన జంతువులు. ఇవి మానవులను సైతం అనుకరించగలవు. మనుషులు, చింపాంజీల డీఎన్‌ఏలో 98.8 శాతం ఒకే లక్షణాలు ఉంటాయట. పనిముట్లను మానవులు మాత్రమే వాడతారనే అనుకునేవారు.. కానీ 1960లో జేన్ గూడాల్ అనే శాస్త్రవేత్త పరిశోధనలో మానవులకు ముందు చింపాంజీలు కూడా పనిముట్లను వాడేవని కనుగొన్నారు. విషయానికొస్తే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.


 ఓ సెలయేరు పక్కన  చింపాజీ నింపాదిగా కూర్చుంది. ఓ పసుపు రంగు టీషర్టును తీసుకుని.. నీళ్లలో ముంచింది. అనంతరం సబ్బు తీసుకుని రుద్దుతూ శుభ్రం చేసింది. దుస్తులను అచ్చం మనిషి లాగానే ఉతుకుతున్న చింపాంజీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎంతవరకు నిజమో గానీ.. నెటిజన్లను మాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. మనిషి చేసినట్లుగానే మక్కీకి మక్కీ దించేసింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది మామూలు చింపాంజి కాదు.. మనిషికి దగ్గర పోలికలు ఉన్న చింపాంజి అంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు. సచిన్ శర్మ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.



Read more