వేగంగా వెళ్తున్న రెండు ట్రైన్ల మధ్య.. అంతే వేగంగా పరుగెడుతున్న గుర్రం.. సినిమా కాదు.. రియల్..

Published: Sun, 23 Jan 2022 16:39:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వేగంగా వెళ్తున్న రెండు ట్రైన్ల మధ్య.. అంతే వేగంగా పరుగెడుతున్న గుర్రం.. సినిమా కాదు.. రియల్..

హార్స్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హార్స్ రైడింగ్‌లో ఉన్నంత కిక్.. మరి దేంట్లోనూ ఉండదు. అంతేకాదు గుర్రపు స్వారీ చేస్తే ఆత్మవిశ్వాసంతో పాటూ కొన్ని రకాల వ్యాధులు కూడా నయమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి మిగతా జంతువుల కంటే అత్యంత వేగంగా పరుగెడతాయి కాబట్టే.. మానవులు ఎప్పటి నుంచో వీటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని గుర్రాలు గంటకు సుమారు 80 నుంచి 90కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. ఇప్పడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. వేగంగా పరుగెడుతున్న ఓ తెల్లటి గుర్రానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అత్యంత వేగంగా ప్రయాణిస్తోన్న రెండు ట్రైన్ల మధ్య.. సదరు గుర్రం అంతే వేగంగా పరుగెడుతుంది. చివరకు ఏమవుతుందో మీరే చూడండి..

వేర్వేరు పట్టాల మీద రెండు రైళ్లు వేగంగా ఎదురుపడడం వీడియోలో చూడొచ్చు. అదే సమయంలో ఓ గుర్రం వాటి మధ్యలో ఇరుక్కుపోతుంది. ఏమాత్రం అదుపుతప్పినా రైళ్ల కింద నలిగిపోయే పరిస్థితి. కానీ ఆ గుర్రం మాత్రం ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా వాటి వేగంతో సమానంగా పరుగెత్తడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గుర్రం ఎలా తప్పించుకుంటుందో అని రైళ్లోని ప్రయాణికులు ఆసక్తిగా గమనిస్తుంటారు. కానీ గుర్రం మాత్రం అదుపుతప్పకుండా అదే వేగంతో వెళ్తుంది. చివరకు ఒక రైలు వెళ్లిపోగానే పక్కనున్న పట్టాల మీదకు వెళ్తుంది. దీంతో ప్రయాణికులంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంటారు. ఊపిరి బిగపట్టుకుని చూడాలనిపించే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ కోతి ఆట ఆడే విధానం చూస్తే.. ఇదెక్కడి కోతిరా నాయనా అంటారు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

పెళ్లీ లేదూ గిల్లీ లేదు.. వ్యభిచారం చేయాల్సిందేనన్న తల్లిదండ్రులు.. వద్దంటున్నా బలవంతంగా.. ఆ గ్రామంలో ఎంతోమంది ఇలాగే..ఒక్క వీడియో కోసం కోడలి ప్రాణాన్ని తీసేసిన మామ.. ఇంతకీ ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోలో ఏముందంటే..ఒంటరిగా వెళ్తున్న బాటసారులే ఆ ట్రాన్స్‌జెండర్ల టార్గెట్.. ఓ వ్యక్తిని అడవిలోకి లాక్కెళ్లి... ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..! ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు.. ఊరి చివర చెట్టుకు ఉరేసుకున్న భర్త.. కాస్త దూరంలోనే భార్య మృతదేహం.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.