Viral Video: మాస్కు పెట్టుకోవడానికి ఈ నేత ఎన్ని తంటాలు పడుతున్నాడో... చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2022-02-27T03:21:46+05:30 IST

కొందరు ఎంత చదువుకున్నా.. ఏ స్థానాల్లో ఉన్నా.. అందరూ ఈజీగా చేసే పనులను కూడా చేయలేక నవ్వులపాలవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. కొందరు మాట్లాడటంలో తడబడుతుంటే...

Viral Video: మాస్కు పెట్టుకోవడానికి ఈ నేత ఎన్ని తంటాలు పడుతున్నాడో... చూస్తే నవ్వు ఆపుకోలేరు..

కొందరు ఎంత చదువుకున్నా.. ఏ స్థానాల్లో ఉన్నా..  అందరూ ఈజీగా చేసే పనులను కూడా చేయలేక నవ్వులపాలవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. కొందరు మాట్లాడటంలో తడబడుతుంటే.. మరికొందరు నడక తదితర విషయాల్లో నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. కరోనా వచ్చి ఇన్నాళ్లవుతున్నా.. ఓ వ్యక్తి మాస్కు ఎలా పెట్టుకోవాలో తెలీక తంటాలు పడ్డాడు. రాజకీయ నేత అయి ఉండి కూడా మాస్కు పెట్టుకోవడంలో తంటాలు పడడం.. అందరికీ నవ్వు తెప్పిస్తోంది.


ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సభపై శివసేన ఎంపీ ధైర్యశిల్‌ ప్రసంగిస్తుండగా..  పక్కనే ఆ పార్టీ నేత ఒకరు నిలబడి ఉంటారు. అంతా మాస్కు పెట్టుకుని ఉండడంతో తాను కూడా మాస్కు పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ముందుగా మాస్కును అటూ, ఇటూ తిప్పి చూసి పొరపాటున సగం ముఖం, సగం నెత్తిన పెట్టుకుంటాడు. మళ్లీ తీసి ఇంకోలా ప్రయత్నిస్తాడు. అలా కాదని మళ్లీ తీసి.. ‘‘దీన్ని  ఎలా పెట్టుకోవాలబ్బా’’ అన్నట్లుగా రియాక్షన్ ఇస్తాడు. ఇంతలో ముందున్న వ్యక్తి అతడికి సాయం చేస్తాడు. దీంతో ఎట్టకేలకు అతడు మాస్కును ధరించి.. హమ్మయ్య! అని అనుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..





Updated Date - 2022-02-27T03:21:46+05:30 IST