
ఒక పనిని సక్రమంగా చేయాలంటేనే తడబడుతుంటాం. అలాంటిది ఒకే సమయంలో రెండు ఆటలు ఆడమంటే అమ్మో! మా వల్ల కాదు అని అంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఆ పనిని చేసి చూపించాడు. అతడు ఆడిన ఆటలు చూస్తే.. అనితర సాధ్యం అనే చెప్పొచ్చు. మంచులో స్కేట్ స్కీయింగ్ చేయడమంటేనే కష్టంతో కూడుకున్న పని.. అలాంటి పనిని అవలీలగా చేస్తూ, మళ్లీ ఫుట్బాల్ ఆడడం చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇన్స్టాగ్రాంలో ప్రఖ్యాత స్కీయర్ ఆండ్రి రాగెట్లీ.. స్కీయింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆండ్రి మంచులో స్కీయింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. వెంటనే ఫుట్ బాల్ తీసుకుని రెండు కాళ్లకు ఉన్న బ్లేడ్లతో తన్నుకుంటూ వెళ్తాడు. అలాగే మరోవైపు స్కీయింగ్ కూడా చాకచక్యంగా చేస్తాడు. వేగంగా స్కీయింగ్ చేస్తూ ముందుకు వెళ్తాడు. మరోవైపు ఫుడ్బాల్ కూడా ఆడుకుంటూ వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చివరగా ఓ మంచు దిబ్బ పైనుంచి పల్టీ కొట్టి తన ఆటను ముగిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘‘ వావ్! ఈ వ్యక్తి భలె ఆడుతున్నాడే’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి