Viral Video: హోటల్లోకి దూరిన ఉడుము రచ్చ రచ్చ చేసింది.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-02-11T01:51:34+05:30 IST

థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్లో జనం రద్దీగా ఉన్నారు. ఆ సమయంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. జనాల మధ్యలోకి హఠాత్తుగా ఓ ఉడుము దూసుకొచ్చింది. దీంతో...

Viral Video: హోటల్లోకి దూరిన ఉడుము రచ్చ రచ్చ చేసింది.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక, ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. అందులోనూ కాస్త విభిన్నమైన వీడియోలు ఎంత వైరల్ అవుతుంటాయో రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి వీడియోల జాబితాలోకి ఇంకో కొత్త వీడియో వచ్చి చేరింది. మనుషులు వెళ్లాల్సిన హోటల్లోకి ఉడుము వెళ్లింది. దీన్ని చూసి అక్కడునున్న వారంతా షాక్ అయ్యారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..


థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్లో జనం రద్దీగా ఉన్నారు. ఆ సమయంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. జనాల మధ్యలోకి హఠాత్తుగా ఓ ఉడుము దూసుకొచ్చింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. అయితే,  అక్కడే ఉన్న ఓ మహిళ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కుర్చీ మీద నిలబడి కేకలు పెడుతుంది. ఇంతలో ఓ వ్యక్తి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడి మీదకు దాడి చేయాలని ప్రయత్నిస్తుంది. నోరు తెరిచి అతడి మీదకు దూసుకెళ్లాలని చూస్తుంది. దీంతో ఆ వ్యక్తి ఓ కర్ర తీసుకుని.. చాకచక్యంగా దాని తలపై గట్టిగా అదిమి పట్టి పక్కకు తీసుకెళ్తాడు. దీంతో ఆ మహిళ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 సింహాలే గుంపులుగా వస్తాయ్.. కానీ ఈ జింక సింగల్‌గానే... చుక్కలు చూపించింది..



Updated Date - 2022-02-11T01:51:34+05:30 IST