Viral Video: ఈ ఉడుత చాలా స్మార్ట్ గురూ.. అనుమానిస్తూనే... అర చేతిలోని బాదం పప్పును ఎలా తింటోందో చూడండి..

Published: Sun, 03 Jul 2022 21:14:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఈ ఉడుత చాలా స్మార్ట్ గురూ.. అనుమానిస్తూనే... అర చేతిలోని బాదం పప్పును ఎలా తింటోందో చూడండి..

మనుషులు కనబడితే ఆమడదూరం పారిపోయే జంతువులు.. ఒక్కోసారి విచిత్రంగా బాగా దగ్గరవుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. అలాంటి వీడియోలు మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంటుంటాయి. ప్రస్తుతం మనం అలాంటి వీడియో గురించే మాట్లాడుకోబోతున్నాం. చిన్న చప్పుడు వినపడినా, పత్తా లేకుండా పారిపోయే ఉడుత.. అందుకు విరుద్ధంగా మనిషి చేతిలోని బాదం పప్పును తింటుంది. ఓ వైపు అనుమానిస్తూనే, మరోవైపు చకచకా బాదం పప్పులను తినడం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అరచేతిలో బాదం పప్పులను పట్టుకుని ఉంటాడు. వాటిని గమనించిన ఓ బుల్లి ఉడుత.. మెల్లగా అతని వద్దకు వస్తుంది. అరచేయి దగ్గరకు వచ్చి ముందుగా ఒక బాదం పప్పును.. టక్కున నోట్లో వేసుకుంటుంది. తర్వాత చాలా సేపు అనుమానంగా చూస్తుంది. కొంపతీసి.. నన్ను పట్టుకోవడానికి ప్లాన్ ఏమీ వేయలేదు కదా!.. అన్నట్లుగా కొద్దిసేపు అనుమానంగా అలాగే చూస్తుంది. తర్వాత తేరుకుని ఎలాగైతే.. అలా అవుతుంది.. అని అన్నట్లుగా చకచకా కొన్ని బాదం పప్పులను నోట్లో కుక్కేసుకుని, అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ‘‘చిప్‌మంక్ మొదటిసారి బాదంపప్పు రుచి చూస్తోంది’’.. అని క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో 6మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

నన్ను చూడడం ఆపండి... అంటున్న బుల్లి ఉడత.. ఇంతకీ అది ఏం చేసిందో మీరే చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

భర్తే కదా అని.. అతడి ముందే దుస్తులు మార్చుకున్న భార్య.. అయితే ఆమెకు తెలీదు.. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయని.. చివరకు..Viral Video: ఆడామగా తేడా లేకుండా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న జంటలు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అని అంటున్న నెటిజన్లు..videoస్కూటీని తోసుకుంటూ వెళ్తున్న బాలికలను చూసి.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఒకరిని బైక్‌పై ఎక్కించుకున్నాడు.. చివరకు పర్సు మర్చిపోయానంటూ..మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం.. Viral Video: నిబంధనలు ఉల్లంఘించి.. డేంజరస్ స్టంట్ చేసిన బైకర్.. కాస్త పట్టు తప్పుంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది..videoViral Video: మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న కోతి, పిల్లి.. స్నేహం అంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు..video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.