చేతికి ఓ సంచి తగిలించుకుని కూరగాయలకు వెళ్లొస్తా.. అంటూ చెప్తున్న ఈ బుడ్డోడి వీడియోను చూస్తే నవ్వాపుకోలేరు..

ABN , First Publish Date - 2021-11-09T17:26:03+05:30 IST

ఆ కుర్రాడికి ఐదేళ్లు కూడా ఉండవేమో.. ఆ వయసులోనే కూరగాయాల లిస్ట్ తీసుకుని మార్కెట్‌కు బయల్దేరాడు..

చేతికి ఓ సంచి తగిలించుకుని కూరగాయలకు వెళ్లొస్తా.. అంటూ చెప్తున్న ఈ బుడ్డోడి వీడియోను చూస్తే నవ్వాపుకోలేరు..

ఆ బుడ్డోడికి ఐదేళ్లు కూడా ఉండవేమో.. ఆ వయసులోనే కూరగాయాల లిస్ట్ తీసుకుని మార్కెట్‌కు బయల్దేరాడు.. ఏమేం కూరగాయలు కోనాలో జాబితా చెప్పాడు.. అంతేకాదు మార్కెట్‌కు ఎన్ని డబ్బులు తీసుకెళ్తున్నాడో కూడా చెప్పాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే అన్నింటినీ గుర్తు ఉంచుకున్న ఆ బాలుడిని అందరూ ప్రశంసిస్తున్నారు. 


ఆ బాలుడి పేరు కబీర్. వీడియోలో తల్లి అడుగుతున్న ప్రశ్నలకు కబీర్ ముద్దుముద్దుగా సమాధానాలు చెప్పాడు. కొన్ని పేర్లను సరిగ్గా పలకలేకపోయాడు. తన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో కూడా చెప్పాడు. అనంతరం భుజానికి సంచి తగిలించుకుని అమ్మమ్మతో కలిసి మార్కెట్‌కు బయల్దేరాడు. నవంబర్ 1న పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. 




Updated Date - 2021-11-09T17:26:03+05:30 IST