Viral Video: ‘‘నా పిల్ల జోలికొస్తే.. ఎవరైనా ఊరుకునేది లేదు’’.. సింహాలతో గేదె పోరాటం..

Published: Fri, 01 Apr 2022 21:39:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: నా పిల్ల జోలికొస్తే.. ఎవరైనా ఊరుకునేది లేదు.. సింహాలతో గేదె పోరాటం..

తల్లి ప్రేమకు సాటి మరేదీ ఉండదు. తాను పస్తులు ఉన్నా.. పిల్లలు ఖాళీ కడుపుతో పడుకుంటే అమ్మ తట్టుకోలేదు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తన పిల్ల జోలికి వచ్చిన సింహాల గుంపునకు గేదె చుక్కలు చూపించింది. పిల్లను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ గేదెను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఓ అడవిలోని విశాల ప్రదేశంలో ఓ గేదె తన పిల్లతో కలిసి సేద తీరుతూ ఉంటుంది. అదే సమయంలో కొన్ని సింహాలు వాటిని గమనించి, వేటాడేందుకు దగ్గరికి వెళ్తాయి. పిల్ల గేదెపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. వెంటనే అప్రమత్తమైన తల్లి గేదె ఆ సింహాలపైకి ఎదరుదాడి చేస్తుంది. పదునైన కొమ్ములతో సింహాలను తిప్పి తిప్పి కొడుతుంది. దాని ధాటికి దగ్గరికి వెళ్లేందుకు కూడా సింహాలు భయపడతాయి. సింహాలు దాడి చేయాలని ఎంత ప్రయత్నించినా.. గేదె మాత్రం వెనక్కు తగ్గకుండా పోరాడుతుంది. ఇంతలో మరికొన్ని గేదెలు అక్కడికి వస్తాయి. అన్నీ కలిసి సింహాలను తరిమికొడతాయి. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు గేదె ధైర్యానికి సెల్యూట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

 ‘తగ్గేదేలే...’ అంటోన్న చింపాంజీ! ఎలా స్టెప్పులేసిందో మీరే చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

తాకరాని చోట తాకుతుంటే మొదట అనుమానం రాలేదు.. ఓ రోజు ప్రైవేట్ క్లాసు ఉందంటూ బాలికను గదికి తీసుకెళ్లిన టీచర్..ఇద్దరు భార్యలనూ ఒకే ఇంట్లో వుంచాడు.. రాత్రి ఎవరితో ఉండాలనే విషయంలో గొడవ.. చివరికి మొదటి భార్యపై.. భార్య అలా చేస్తే.. భర్తకు భరణం ఇవ్వాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పుమేకల అరుపులు విని అటుగా వెళ్లిన స్థానికులు.. కడుపుతో ఉన్న మేకను పట్టుకుని ముగ్గురు కలిసి చేస్తున్న పని చూసి షాక్.. చివరకు..అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. యువతి బెడ్‌రూంలోకి వెళ్లి కత్తితో బెదిరించగానే.. ఆమె ఇచ్చిన రియాక్షన్..ప్రియుడు పిలవడంతో డిన్నర్‍‍‌కు వెళ్లిన యువతి.. అనంతరం రాత్రి అతడి గదికి వెళ్లగా.. లోపల ఊహించని విధంగా..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.