Viral Video: చిరుత ఎంత వేగంగా పరిగెట్టగలదో ఎప్పుడైనా చూశారా? షాకవుతున్న నెటిజన్లు
ABN , First Publish Date - 2022-07-01T22:37:53+05:30 IST
ఎవరైనా వేగంగా పరిగెడితే వారిని చిరుత పులితో పోలుస్తారు. వేగానికి చిరుత పర్యాయపదంగా మారిపోయింది
ఎవరైనా వేగంగా పరిగెడితే వారిని చిరుత పులితో పోలుస్తారు. వేగానికి చిరుత పర్యాయపదంగా మారిపోయింది. చిరుత వేగంగా పరిగెడుతుందని వినడమే కానీ, ఎప్పుడూ చూసి ఉండరు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిరుత వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిరుత కేవలం 16 అడుగుల్లో 100 మీటర్ల దూరాన్ని కవర్ చేసింది. దాని ఒక జంప్ 7 మీటర్ల వరకు ఉంది.
@wonderofscience అనే ట్విటర్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో చిరుత అత్యంత వేగంగా పరిగెడుతోంది. చిరుత ఒక జంప్‌లో 23 అడుగుల దూరాన్ని కవర్ చేసిందని వీడియోలో చెప్పారు. ఈ వీడియోను జూన్ 29న షేర్ చేయగా ఇప్పటికి 45 లక్షల వ్యూస్ వచ్చాయి. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.