Viral Video: ఈ కుక్కల వాలీబాల్ గేమ్ మామూలుగా లేదుగా.. అచ్చం మనుషుల్లాగే ఆడుతున్నాయే..
ABN , First Publish Date - 2022-01-10T00:06:39+05:30 IST
కొన్ని కుక్కలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చాలా కుక్కలన్నీ కలిసి వాలీబాల్ ఆడే విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది...
జంతువులతో ఆటలు ఆడించడం మామూలే. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కుక్కలతో చాలా స్టంట్లు చేయించడం చూస్తుంటాం. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన శునకాలు పోలీసులకు వివిధ కేసుల్లో ఎంత సహాయపడుతుంటాయో అందరికీ తెలిసిందే. కొన్ని కుక్కలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చాలా కుక్కలన్నీ కలిసి వాలీబాల్ ఆడే విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కుక్కలన్నీ కలిసి అచ్చం మనుషుల్లాగే వాలీబాల్ ఆడడం.. అదరినీ ఆశ్యర్యపరుస్తోంది.
కుక్కలన్నీ కలిసి ఓ బెలూన్‌తో వాలీబాల్ ఆడడం ఈ వీడియోలో చూడొచ్చు. మనుషులు ఎలాగైతే పోటీపడుతూ వాలీబాల్ ఆడతారో.. అచ్చం ఈ కుక్కలు కూడా ఒకదానికొకటి పోటీపడుతూ గేమ్ ఆడుతుంటాయి. ఓ కుక్క అన్నింటికీ చురుగ్గా బెలూన్ను కొడుతూ తీసుకెళ్తుంది. మిగతా కుక్కలన్నీ దానికి పోటీపడుతూ బెలూన్ను కొట్టేందుకు ఎగబడుతుంటాయి. కానీ బెలూన్ వాటికి చిక్కకుండా ఆ కుక్క కొట్టుకుంటూ పక్కకు తీసుకెళ్తుంది. తర్వాత మరికొన్ని కుక్కలు దాన్ని కొట్టుకొంటూ వెళ్లడం.. చూసే వారిని తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.