పిల్లలతో ఏనుగు ఆటలు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-04-24T18:07:08+05:30 IST

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.

పిల్లలతో ఏనుగు ఆటలు.. వైరల్ అవుతున్న వీడియో!

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ ఏనుగు తన కవల పిల్లలతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌కు చెందిన ఓ ఏనుగు ఈ వారంలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. 


ఏనుగుకు కవల పిల్లలు పుట్టడం చాలా అరుదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పది లక్షల ఏనుగుల్లో ఒకటి మాత్రమే కవల పిల్లలకు జన్మనిస్తుందట. కాగా, తన కవల పిల్లలతో ఆ తల్లి ఏనుగు ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగు తన పిల్లలకు నడక నేర్పిస్తోంది. 



Updated Date - 2022-04-24T18:07:08+05:30 IST