Viral Video: విమానం నుంచి సరస్సుల్లోకి దూకుతున్న చేపలు... ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-29T22:29:17+05:30 IST

ఆకాశం నుంచి నేలపై చేపలు పడే విషయం తెలుసు కానీ.. విమానం నుంచి సరస్సుల్లోకి చేపలు దూకడం ఏంటీ! అని ఆశ్యర్యపోతున్నారా.. ఈ వీడియో చూస్తే అసలు విషయం మీకే అర్థమవుతుంది. యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో ఎత్తైన..

Viral Video: విమానం నుంచి సరస్సుల్లోకి దూకుతున్న చేపలు... ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఆకాశం నుంచి నేలపై చేపలు పడే విషయం తెలుసు కానీ.. విమానం నుంచి సరస్సుల్లోకి చేపలు దూకడం ఏంటీ! అని ఆశ్యర్యపోతున్నారా.. ఈ వీడియో చూస్తే అసలు విషయం మీకే అర్థమవుతుంది. యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సరస్సుల్లోకి ఇలా వేలాది చేపలను వదలడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది. వివరాల్లోకి వెళితే..


యూఎస్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సదులు, సరస్సుల్లో ఒక విమానం ద్వారా 35,000 చేపలను వదులుతున్నారు. ఒకటి నుంచి మూడు అంగుళాల పొడవున్న చేపలను నీటితో పాటూ కిందకు వదలడం వల్ల వాటికి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా సరస్సులోకి వెళ్లిపోతాయని వారు తెలిపారు. ఈ వారంలో సుమారు 200 ఎత్తైన సరస్సుల్లో చేపలను వదిలినట్లు పేర్కొన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సరస్సుల్లో చేపల సంతానోత్పత్తిని పెంచడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వసంతకాలం, వేసవి ప్రారంభంలో ఇలా విమానాల ద్వారా చేపలను సరస్సుల్లోకి వదులుతారు. ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సుమారు 300సరస్సుల్లో ఈ పద్ధతి ద్వారా చేపలను వదులుతుంటారు.

వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..


పునరుత్పత్తి సాధ్యం కాని సరస్సులను ఎంచుకుని చేపలను వదులుతుంటామని సదరు సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఎత్తైన ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్లేందుకు సాధ్యం కాదని, అందుకే 1956 నుంచి ఇలా విమానాల సాయంతో చేపల విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 1950 కంటే ముందు చేపలను వదిలేందుకు గుర్రాలను వినియోగించేవారని చెప్పారు. విమానాలను వినియోగించడం ఖర్చుతో కూడుకున్నదే అయినా.. తక్కువ సమయంలో ఎక్కువ చెరువుల్లో చేపలను వదిలేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ఈ వీడియోను వన్యప్రాణి వనరుల ఉటా విభాగం.. తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా షేర్ చేసింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

 వావ్! ఈ seal పూలు అందించి.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయగానే.. ప్రియురాలి రియాక్షన్ చూడండి..





Updated Date - 2022-06-29T22:29:17+05:30 IST