వరుడిని భుజాలపై ఎత్తుకుని మరీ ఓ ఫ్రెండ్ డ్యాన్స్.. క్షణాల్లోనే ఊహించని ఘటన.. వీడియో వైరల్

Jun 21 2021 @ 17:20PM

పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియకపోయినా.. వాటిని చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. తాజాగా అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


పెళ్లి రోజు వరుడిని భుజాలపై ఎత్తుకుని అతని స్నేహితుడు ఊరేగింపులో డ్యాన్స్ చేశాడు. అయితే కొంత సేపటికి బ్యాలెన్స్ తప్పి కింద పడేసి అతనిపై పడ్డాడు. వెనక్కి పడడంతో వరుడుకి కాస్త గట్టిగానే దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.