Viral Video.. అప్పటివరకూ ప్రసంగం విన్న అమెరికా అధ్యక్షుడు.. సడెన్‌గా కొన్ని సెకన్ల పాటు..

ABN , First Publish Date - 2021-11-03T00:06:50+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాప్26 సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా రికార్డు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral Video.. అప్పటివరకూ ప్రసంగం విన్న అమెరికా అధ్యక్షుడు.. సడెన్‌గా కొన్ని సెకన్ల పాటు..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాప్26 సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా రికార్డు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పర్యావరణ పరిరక్షణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ప్రపంచ దేశాధినేతలతో పాటూ బైడెన్ కూడా పాల్గొన్నారు. అయితే.. ప్రారంభ ప్రసంగాన్ని మొదట జాగ్రత్తగా విన్న బైడెన్ ఆ తరువాత అకస్మాత్తుగా కొద్ది క్షణాల పాటు కళ్లుమూసుకుంటారు. ఇది చూసిన వారికి ఆయన కునుకు తీశారనే భావన కలిగే అవకాశం ఉంది. దీంతో.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన ఓ విలేకరి సోమవారం ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి..‘బైడెన్ కునుకు తీస్తున్నట్టు కనిపిస్తోంది’ అంటూ కామెంట్ పెట్టారు. ఆ తరువాత.. క్లిప్పింగ్ విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇప్పటివరకూ దీనికి నలభై లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన వారిలో అనేక మంది సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెడుతున్నారు. బైడెన్ మళ్లీ కునుకు తీశారంటూ గోలగోల చేస్తున్నారు. 


కాగా.. బైడెన్ గతంలోనూ ఇలా కనుకు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించే అమెరికా మాజీ అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్.. బైడెన్‌ను ‘స్లీపీ జో’గా పిలుస్తుంటారు. వృద్ధాప్యం మీద పడ్డ ఆయన దేశానికి ఏం సేవ చేయగలరంటూ పలు మార్లు నోరు కూడా పారేసుకున్నారు. ఇప్పటివరకూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో బైడెన్ పెద్దవయస్కుడన్న విషయం తెలిసిందే. ఆయన వయసు ప్రస్తుతం 79 సంవత్సరాలు.  ఈ నేపథ్యంలో బైడెన్ ప్రస్తుత వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే.. అనేక మంది నెటిజన్లు తాము బైడెన్ పరిస్థితిని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించారు. ‘పెద్ద పెద్ద సమావేశాలకు వెళ్లినప్పుడు మనం కూడా ఇలా ఏదోక సందర్భంలో చిన్న కునుకు తీసే ఉంటాం’ అని కామెంట్లు పెడుతున్నారు. 



Updated Date - 2021-11-03T00:06:50+05:30 IST