Viral Video: డబ్బులు ఇస్తావా? లేదా?.. తల్లిని బూతులు తిడుతూ వీరంగం వేసిన బాలుడు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-09-05T21:18:51+05:30 IST

పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారిని దారిలో పెట్టాలి. పద్ధతి, సంస్కారవంతంగా పెంచేందుకు కృషి చేయాలి.

Viral Video: డబ్బులు ఇస్తావా? లేదా?.. తల్లిని బూతులు తిడుతూ వీరంగం వేసిన బాలుడు.. వీడియో వైరల్!

పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారిని దారిలో పెట్టాలి. పద్ధతి, సంస్కారవంతంగా పెంచేందుకు కృషి చేయాలి. అతిగా ముద్దు చేసినా, అసలు పట్టించుకోకపోయినా వారు చిన్న వయసులోనే చెడు మార్గం వైపు ఆకర్షితులవుతారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తుంటారు. డబ్బులు ఇవ్వకపోతే.. ఇంట్లో వారిని నోటికొచ్చినట్లు తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


కేరళకు (Kerala) చెందిన ఒక బాలుడు తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ తన తల్లిని ( boy assaulting mother) దుర్భాషలాడడం ఆ వీడియోలో కనిపిస్తోంది. డబ్బు ఇవ్వలేదనే కారణంతో ఆ కుర్రాడు తన తల్లిని బూతులు తిట్టాడు. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఓ వృద్ధురాలిని కొట్టాడు. ఆమెను తన్నడానికి కూడా ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. `కేరళ  ఒకప్పుడు అక్షరాస్యతలో ముందంజలో ఉండేది. అయితే.. ప్రస్తుతం మద్యం, డ్రగ్స్ వాడకంలో టాప్‌లో ఉంది. ఎంతో మంది యువత మత్తుపదార్థాలకు బానిసగా మారార`ని ఆ వ్యక్తి ట్విటర్‌లో కామెంట్ చేశాడు. 

Updated Date - 2022-09-05T21:18:51+05:30 IST