Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్ మీద వెళ్తూ రొమాన్స్!

ABN , First Publish Date - 2022-04-23T18:24:20+05:30 IST

సాధారణంగా ప్రేమికులు ఎవరి కంటా పడకుండా రొమాన్స్ సాగిస్తుంటారు.

Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్ మీద వెళ్తూ రొమాన్స్!

సాధారణంగా ప్రేమికులు ఎవరి కంటా పడకుండా రొమాన్స్ సాగిస్తుంటారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ యువజంట నడిరోడ్డుపైనే హల్‌చల్ చేసింది. నలుగురు చూస్తున్నారనే విషయాన్ని కూడా మరిచి బైక్‌పై వెళ్తూ ముద్దుల్లో మునిగి తేలింది. బిజీగా ఉన్న రోడ్డులో బండి మీదే రొమాన్స్ సాగించింది. ఈ దృశ్యం చూసి అటుగా వెళ్లే వాళ్లు ఆశ్చర్యపోయారు. 


కర్ణాటకలోని చామరాజనగర్‌లోని గుండ్లుపేట రోడ్డుపై ఓ జంట బైక్‌పై వెళ్తూనే రొమాన్స్ సాగించింది.  అమ్మాయి పెట్రోల్ ట్యాంకు మీద అబ్బాయికి ఎదురుగా కూర్చొని ఉంది. అబ్బాయి బండి నడుపుతుంటే అతడ్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టింది. అతడు ఆమెతో సరసాలు ఆడుతూనే బైక్‌ను నడిపాడు. రోడ్డుపై వాహనాలు వస్తూ పోతూ ఉన్నా సరే వారు రొమాన్స్ ఆపలేదు. చుట్టుపక్కలవాళ్లు గమనిస్తున్నారన్న సోయి లేకుండా ఈ జంట రొమాన్స్‌లో మునిగిపోయింది. 



Updated Date - 2022-04-23T18:24:20+05:30 IST