Uttar Pradesh: రెస్టారెంట్‌లో యువతితో అసభ్య ప్రవర్తన.. తుపాకీ గురి పెట్టి వేధింపులు.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-08T01:57:07+05:30 IST

ఒక యువకుడు తమ బంధువు అయిన ఓ అమ్మాయిని కొద్ది రోజులుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు

Uttar Pradesh: రెస్టారెంట్‌లో యువతితో అసభ్య ప్రవర్తన.. తుపాకీ గురి పెట్టి వేధింపులు.. చివరకు..

ఒక యువకుడు తమ బంధువు అయిన ఓ అమ్మాయిని కొద్ది రోజులుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఆమెతో చనువు పెంచుకుని అత్యాచారం చేశాడు.. ఆ ఘటనను వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేవాడు.. చివరకు ఆమెను ఓ రెస్టారెంట్‌లో బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.. ఆ వీడియో వైరల్ కావడంతో చివరకు పోలీసులకు చిక్కాడు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

నాకు అమ్మాయిలంటేనే ఇష్టం.. చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గు పడటం లేదు.. అవమానాలను ఎదుర్కొని నిలిచిన యువతి కథ ఇదీ..!


బాధిత యువతి ఘజియాబాద్‌ (Ghaziabad)లో తన తల్లి, ముగ్గురు సోదరులతో కలిసి నివసిస్తోంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో బాధిత యువతి ఆమెతో పాటు ఇంట్లోనే ఉండేది.  ఆ సమయంలో సమీప బంధువు అయిన బిలాల్ ఆమె ఇంటికి వెళుతుండేవాడు. నాలుగు నెలల క్రితం ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యువకుడు ఆమెకు తుపాకీ చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. దాన్ని వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. గత నెల 29న ఆ యువతి తన తల్లి మందుల కోసం మార్కెట్‌కు వెళ్లింది. 


మార్గమధ్యంలో నిందితుడు బిలాల్ బైక్‌పై వచ్చి ఆ యువతిని అడ్డుకుని తుపాకీ చూపించి బలవంతంగా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వీడియో వైరల్ అయింది. బాధితురాలు బిలాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహితుడైన బిలాల్ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడని, తాను అందుకు నిరాకరించడంతో వేధిస్తున్నాడని తెలిపింది. నిందితుడు బిలాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-09-08T01:57:07+05:30 IST