viral Video: పోలీసు వ్యాన్‌లో ఖైదీ బర్త్ డే కేక్ కటింగ్

ABN , First Publish Date - 2022-08-22T18:49:24+05:30 IST

ఓ అండర్ ట్రయల్ ఖైదీని కోర్టుకు తీసుకువెళుతూ పోలీసు వ్యానులోపలే అతనితో బర్త్ డే కేక్ కటింగ్ చేయించిన పోలీసుల బాగోతం....

viral Video: పోలీసు వ్యాన్‌లో ఖైదీ బర్త్ డే కేక్ కటింగ్

ముంబయి(మహారాష్ట్ర): ఓ అండర్ ట్రయల్ ఖైదీని కోర్టుకు తీసుకువెళుతూ పోలీసు వ్యానులోపలే అతనితో బర్త్ డే కేక్ కటింగ్(cutting birthday cake) చేయించిన పోలీసుల బాగోతం తాజాగా మహారాష్ట్రలోని(Maharashtra) థానే జిల్లాలో వెలుగుచూసింది. హత్య కేసులో నిందితుడైన ఖైదీని(murder accused) కోర్టుకు  పోలీసు వ్యానులో తీసుకువెళుతూ అతని జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించిన పోలీసుల వ్యవహారం కెమేరా కంటికి చిక్కింది. పోలీసుల నైతికతను ప్రశ్నించేలా ఉన్న ఈ బాగోతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. థానే జిల్లా(Thane district) ఉల్లాస్ నగర్ ప్రాంతానికి చెందిన రోషన్ ఝా(Roshan Jha) గ్యాంగ్‌స్టర్. ఇతను పలు హత్యలు, హత్యాయత్నం, డబ్బువసూలు కేసుల్లో నిందితుడు. (gangster and is accused in several cases)


థానే జిల్లా పోలీసులు రోషన్ ఝాను పోలీసు వ్యానులో కల్యాణ్ కోర్టుకు తీసుకువెళుతుండగా, అతని మద్ధతుదారులు తీసుకువచ్చిన బర్త్ డే కేక్ ను కట్ చేశారు. ఖైదీ మద్ధతుదారులు గ్యాంగ్ స్టర్ రోషన్ ఝా వీడియోను వాట్సాప్ లో(WhatsApp) పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.పోలీసులు తమ వ్యానులోనే ఖైదీకి జన్మదినోత్సవం చేయడంపై పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Updated Date - 2022-08-22T18:49:24+05:30 IST