Viral Video: గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వరుడిని పిలిచి మరీ వధువు ఫ్లయింగ్ కిస్.. అమ్మా కాస్త ఆగు తల్లీ.. అంటూ నెటిజన్ల రియాక్షన్స్..!

Published: Thu, 28 Oct 2021 19:02:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వరుడిని పిలిచి మరీ వధువు ఫ్లయింగ్ కిస్.. అమ్మా కాస్త ఆగు తల్లీ.. అంటూ నెటిజన్ల రియాక్షన్స్..!

పెళ్లి వేడుకలో వధువు సిగ్గుతో తల దించుకుని, దిగాలుగా ఉండడం సాధారణమే. ఓ వైపు బంధువుల కోలాహలం, మరోవైపు అప్పటిదాకా ఎవరో తెలీని వ్యక్తి.. తన భర్తగా మారుతుండడం.. ఇలా ఏవోవే కారణాలతో చాలామంది సైలెంట్‌గా ఉంటారు. అయితే కొందరు యువతులు మాత్రం ఎలాంటి భయం లేకుండా సరదా సరదగా ఉంటారు. అంతటితో ఆగకుండా కాబోయే భర్తను కూడా ఆట పట్టిస్తూ ఉంటారు. అలాంటి వేడుక చూడ్డానికి కూడా కనులవిందుగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇలాంటి కోవకు చెందినదే..

Viral Video: గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వరుడిని పిలిచి మరీ వధువు ఫ్లయింగ్ కిస్.. అమ్మా కాస్త ఆగు తల్లీ.. అంటూ నెటిజన్ల రియాక్షన్స్..!

ఓ వైపు పెళ్లి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు వరుడు మండపంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. అయితే వరుడు ఎలా ఎంట్రీ ఇస్తాడని అంతా ఎదురు చూస్తున్నారు. బంధువులతో పాటూ పెళ్లి కుమార్తె కూడా.. కాబోయే భర్త కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఇంతలో రానే వచ్చాడు పెళ్లికొడుకు. సరికొత్తగా గుర్రంపై వచ్చిన వరుడిని చూసి అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఆసక్తిగా ఉన్న పెళ్లి కుమార్తె.. సంతోషాన్ని ఆపుకోలేకపోయింది.

Viral Video: గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వరుడిని పిలిచి మరీ వధువు ఫ్లయింగ్ కిస్.. అమ్మా కాస్త ఆగు తల్లీ.. అంటూ నెటిజన్ల రియాక్షన్స్..!

మండపంలో పై అంతస్తులో ఉన్న ఆమె.. ఎలాగైనా వరుడిని చూడాలని ఆశపడింది. పైనుంచి సైగలు చేయడంతో పక్కనున్న వారు చెప్పగా.. వరుడు ఒక్కసారిగా వధువు వైపు చూశాడు. అంతే తన భర్తకు చేయి ఊపి హాయ్ చెబుతూ.. ప్లయింగ్ కిస్‌లు ఇచ్చేసింది. దీంతో వరుడు కూడా సంతోషంతో బదులిచ్చాడు. దీన్నంతా గమనిస్తున్న బంధువులు చప్పట్లతో ఇద్దరినీ అభినందించారు. కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉండాలంటూ ఆశీర్వదించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వధూవరులను తెగ మెచ్చుకుంటున్నారు. అమ్మా కాస్త ఆగు తల్లీ అంటూ చమత్కరిస్తున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.