టెలిగ్రామ్‌ నుంచి వీడియోకాల్స్‌

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

టెలిగ్రామ్‌ తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీస్‌, అనుభవం ఇచ్చే క్రమంలో కొత్త ఫీచర్లను జతచేస్తోంది. తాజాగా తాము పరిచయం చేస్తున్న వీడియోకాల్‌ ఫీచర్‌ ఈ నెల నుంచి

టెలిగ్రామ్‌ నుంచి వీడియోకాల్స్‌

టెలిగ్రామ్‌ తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీస్‌, అనుభవం ఇచ్చే క్రమంలో కొత్త ఫీచర్లను జతచేస్తోంది. తాజాగా తాము పరిచయం చేస్తున్న వీడియోకాల్‌ ఫీచర్‌  ఈ నెల నుంచి అందుబాటులోకి రానుందని ‘టెలిగ్రామ్‌’లోనే అధికారికంగా వెల్లడించింది. 


క్లౌడ్‌ ఆధారిత మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’లో వచ్చే నెల నుంచి వీడియోకాల్స్‌ సదుపాయం సమకూరనుంది. వాట్సాప్‌ పాలసీలో మార్పుల ఫలితంగా ఎక్కువ మంది టెలిగ్రామ్‌ని ఎంపిక చేసుకుంటున్న నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామమిది. టెలిగ్రామ్‌ తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీస్‌, అనుభవం ఇచ్చే క్రమంలో కొత్త ఫీచర్లను జతచేస్తోంది. తాజాగా తాము పరిచయం చేస్తున్న వీడియోకాల్‌ ఫీచర్‌ ఈ నెల నుంచి అందుబాటులోకి రానుందని ‘టెలిగ్రామ్‌’లోనే అధికారికంగా వెల్లడించింది.  వన్‌ టు వన్‌ వీడియో కాల్స్‌ ఇప్పటికే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అవుతున్నాయి.


అంటే దీంట్లో మూడో వ్యక్తి చొరబాటుకు ఆస్కారం ఉండదు. తాజా నిర్ణయంతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సదుపాయం కూడా కలుగుతుంది. వాట్సాప్‌లో ఈ సదుపాయం  ఇప్పటికే ఉంది.  వెబ్‌కె, వెబ్‌జెడ్‌ పేరిట మరో రెండు యాప్‌లను టెలిగ్రామ్‌ విడుదల చేయనున్నట్టు సమాచారం. చాట్‌ ఫోల్డర్లు, సపోర్ట్‌ సిక్కర్లు, సెర్చ్‌ లాంటి మరికొన్ని ఆప్షన్లు ఈ యాప్‌లో ఉంటాయి.

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST