Bengaluru floods: బెంగళూరు వరదలు.. హృదయాలను కదిలిస్తున్న ఘటనలు.. అంతా అయ్యో పాపం అంటూ..

ABN , First Publish Date - 2022-09-08T22:19:55+05:30 IST

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరును (Bangalore) భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల నదులను తలపిస్తున్నాయి..

Bengaluru floods: బెంగళూరు వరదలు.. హృదయాలను కదిలిస్తున్న ఘటనలు.. అంతా అయ్యో పాపం అంటూ..

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరును (Bangalore) భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద నీరు చేరడంతో ఐటీ కంపెనీలకు దాదాపు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. బెంగుళూరులో వారంలోనే రెండోసారి కుండపోత వర్షం పడటంతో (Heavy rain) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంపంగిరామనగర్‌లో 148 మిల్లీమీటర్లు, మారతహళ్లి, దొడ్డనెక్కుంది, వర్తూరు, హెచ్‌ఏఎల్‌ రోడ్డు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఇదిలావుండగా, వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి తన పెంపుడు జంతువైన కుక్కను.. వరద నీటిలో జాగ్రత్తగా నడిపిస్తూ తీసుకెళ్తున్నాడు. యజమాని ముందు వెళ్తుండగా.. అతన్ని అనుసరిస్తూ కుక్క కూడా వెనుకే జాగ్రత్తగా వెళ్లడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు దివ్య స్పందన తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు అయ్యో పాపం! అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు చాలా మంది ట్రాక్టర్లు, ఆటోల్లో తమ పెంపుడు జంతువులతో సహా సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్తున్నారు.

Anand Mahindra Tweet: ‘‘టికెట్ లెస్ ట్రావెల్’’ అంటే ఏంటో తెలుసా? ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..

 







Updated Date - 2022-09-08T22:19:55+05:30 IST