విదేశీ గడ్డపై స్వదేశీ అభిమానం

Published: Mon, 15 Aug 2022 22:31:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విదేశీ గడ్డపై స్వదేశీ అభిమానంఅమెరికా వీధుల్లో జాతీయ జెండాలతో సంగం చిన్నారులు

 అమెరికా వీధుల్లో భారతీయ జెండా రెపరెపలు

సంగం, ఆగస్టు 15: అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిరపడిన సంగం గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలోని చిన్నారులు సోమవారం మన దేశస్వాతంత్య్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ  జాతీయ జెండాలు చేతపట్టి  వీధుల్లో తిరిగారు.  సంగం గ్రామానికి చెందిన గిరి ట్రేడర్స్‌ నిర్వాహకులు గునుపూడి గిరిబాబు కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తి  ఫ్లోరిడా స్టేట్‌లోని ఓ యూనివర్సిటీ హెడ్‌గా పనిచేస్తున్నారు.  ఆయన సంతానం రోహన్‌ కుమార్‌(7), ప్రేమ్‌ కుమార్‌ (5). అక్కడే చదువుతున్నారు. సోమవారం  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారులు భారతీయ జెండాలు చేతపట్టి వీధుల్లో రెపరెపలాడించారు.ఈ ఫొటో సంగంలో ఉన్న నాన్నమ్మ, తాతకు పంపించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.