విధాన పరిషత్‌ సభాపతి స్థానం కోసం Bjpలో తీవ్ర పోటీ

ABN , First Publish Date - 2022-05-18T17:06:54+05:30 IST

విధాన పరిషత్‌లో బీజేపీకి ఆధిక్యం ఉండడంతో సభాపతి స్థానం ఆ పార్టీకి దక్కడం దాదాపు ఖాయం కానుంది. బసవరాజ హొరట్టి సభాపతి స్థానానికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా

విధాన పరిషత్‌ సభాపతి స్థానం కోసం Bjpలో తీవ్ర పోటీ

                            - తెరపైకి శశిల్‌ నమోషి పేరు


బెంగళూరు: విధాన పరిషత్‌లో బీజేపీకి ఆధిక్యం ఉండడంతో సభాపతి స్థానం ఆ పార్టీకి దక్కడం దాదాపు ఖాయం కానుంది. బసవరాజ హొరట్టి సభాపతి స్థానానికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. హొరట్టి రాజీనామాతో ఖాళీ అయిన సభాపతి స్థానం కోసం బీజేపీలో అప్పుడే తీవ్ర పోటీ ప్రారంభమైంది. పరిషత్‌ సభాపతి ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సోమవారం గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌తో సంభాషించారు. నూతన సభాపతి ఎన్నిక జరిగేంతవరకు తాత్కాలిక సభాపతిగా ఎమ్మెల్సీ రఘునాథ్‌రావ్‌ మల్కాపురెను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు పరిషత్‌కు ఎన్నికైన నమోషి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళినికుమార్‌ కటిలు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవితోనూ ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు కూడా అత్యంత ఆప్తుడు కావడంతో న మోషికి అవకాశం ఖాయమని పార్టీ వ ర్గాలు అంచనా వేస్తున్నాయి. పరిషత్‌కు త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 11 స్థానాలకు గాను కనీసం 7 స్థానాలు లభిస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో పరిషత్‌లో బీజేపీ బలం మరింత పెరగనుంది. జేడీఎస్‌ మద్దతు లేకుండానే సభాపతి స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-05-18T17:06:54+05:30 IST