విద్యార్థుల భవిష్యత్తు కోసమే అమ్మఒడి

ABN , First Publish Date - 2022-07-02T06:39:25+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తు కోసమే అమ్మఒడి

విద్యార్థుల భవిష్యత్తు కోసమే అమ్మఒడి

పెనమలూరు, జూలై 1 : విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి జగన్‌ అమ్మఒడి పథకాన్ని అమలులోకి తీసుకువ చ్చారని ఎమ్మెల్యే కె. పార్థసారథి అన్నారు. శుక్ర వారం తాడిగడప హైస్కూల్‌లో 3వ విడత అమ్మఒడి కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్థసారథి తొలుత 3వ విడత అమ్మఒడి లబ్ధిదారుల వివరాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ జగనన్న విద్యా కానుక, నాడు - నేడు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికసాయాన్ని అందిపుచ్చుకుని విద్యా ర్థులు మంచి నాణ్యమైన విద్యను పొంది భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటారన్నారు. లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు ఖాతాకు అమ్మఒడి నిధులను చేర్చడం ద్వారా విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రకాశ రావు, మండల విద్యాశాఖాధికారిని కనక మహాలక్ష్మి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ బాబూరావు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:39:25+05:30 IST