అదే విద్యాబాలన్‌ బలం!

Jun 10 2021 @ 16:15PM


బాలీవుడ్‌లో విద్యాబాలన్‌ కోరిన పారితోషికం ఇవ్వడానికి ఆమె ఎంచుకునే కథలు, పాత్రలే కారణం అంటున్నారు నిర్మాతలు. కథానాయికగా ఆమె నిలబడడానికి ఓ కారణం ఇదే. బోల్డ్‌ క్యారెక్టర్‌ అయినా, కథానాయికగా ప్రాధాన్యం ఉన్న పాత్ర అయినా వంద శాతం న్యాయం చేస్తారామె. డర్టీ పిక్చర్‌లో సిల్క్‌స్మిత, కహానీలో బాగ్చి,  శకుంతలా దేవి, ‘తుమ్హారీ సులు’లో ఆర్‌జె పాత్రలు ఇందుకు ఉదాహరణలు. అయితే తాజాగా ఆమె నటించిన ‘షేర్నీ’ ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో విద్యా నటన చూసి అభిమానులు ముగ్ధులయ్యారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు విద్యాను పొగడ్తల వర్షంలో ముంచేస్తున్నారు. ‘‘విద్యాబాలన్‌ వర్సలైట్‌ యాక్టర్‌ మాత్రమే కాదు.. పాత్ర విషయంలో ఆమె తీసుకునే జాగ్రత్త, నటించే తీరు ఆమెను నటిగా పది మెట్లు ఎక్కేలా చేశాయి. నటన పట్ల ఆమెకున్న ప్యాషన్‌ అది. ఆమె దర్శకుల కథానాయిక మాత్రమే కాదు.. నిర్మాతల మంచి కోరే కథానాయిక. షేర్నీ పాత్రకు ఆమె పర్ఫెక్ట్‌ యాప్ట్‌’’ అని నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, విక్రమ్‌ మల్హోత్ర అన్నారు. అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది. 





 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.