వృత్తి విద్య.. అవగాహన మిథ్య!

ABN , First Publish Date - 2022-08-20T04:47:50+05:30 IST

సమాజంలో ప్రాధాన్యం కలిగిన వృత్తి విద్యా కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.

వృత్తి విద్య..  అవగాహన మిథ్య!
ప్రభుత్వ ఐటీఐ కళాశాల

కోర్సులపై ఆసక్తి చూపని విద్యార్థులు

జిల్లాలో ఉన్న సీట్లు 2,836... భర్తీ అయినవి 210

రెండోవిడత ప్రవేశాలకు నోటిఫికేషన


నెల్లూరు (విద్య), ఆగస్టు 19 : సమాజంలో ప్రాధాన్యం కలిగిన వృత్తి విద్యా కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. 2022-23 ఏడాదికిగాను గత నెలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కేవలం 210 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 2,600 పైచిలుకు సీట్లు ఖాళీగా ఉండటంతో మలివిడత కౌన్సెలింగ్‌ అధికారులు నోటిఫికేషన జారీ చేశారు. జిల్లాలో ఆరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 944 సీట్లు, 17 ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 1,892 సీట్లు కలిపి మొత్తం 2,836 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ మెకానికల్‌, ఎలక్ర్టీషియన్‌, ఎలక్ర్టానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇన్‌స్ర్టుమెంట్‌ మెకానిక్‌, మెకానిస్ట్‌, మెకానిక్‌ (మోటర్‌ వెహికల్‌), మెకానిక్‌ (రిఫ్రిజిరేటర్‌-ఏసీ), టర్నర్‌, వైర్‌మెన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండేళ్లు కోర్సులుగా ఉన్నాయి. అలాగే నాన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కంప్యూటర్‌ కోర్సు (కోపా), డ్రస్‌ మేకింగ్‌, మెకానిక్‌ డీజల్‌, వెల్డర్‌, కుట్టు సాంకేతికత (స్వీయింగ్‌ టెక్నాలజీ), హార్టీకల్చర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సైంటిఫిక్‌ గ్లాస్‌ అండ్‌ నియోన్‌ సిన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏడాది కోర్సులు. ఇప్పటికే వీటిలో ప్రవేశాల కోసం గత నెలలో కౌన్సెలింగ్‌ నిర్వహించగా, 210 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన జారీ చేశారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధిని కల్పించే ట్రేడులు అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాని పరిస్థితులపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. 


కొరవడుతున్న అవగాహన


జిల్లా విద్యార్థులు ఎక్కువగా ఎలక్ర్టీషిన ట్రేడ్‌ మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇనుసు్ట్రమెంట్‌ మెకానిక్‌ ట్రేడుల్లో ఉత్తీర్ణులైన వారికి ఫార్మా కంపెనీలతోపాటు డాక్‌యార్డ్‌లలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌, ఎలకీ్ట్రషియన, డీజిల్‌ మెకానిక్‌, మోటర్‌ మెకానిక్‌, ఇను్‌స్ట్రమెంట్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారికీ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే డ్రాఫ్ట్‌మెన సివిల్‌, వెల్డర్‌, కోపా, స్వూయింగ్‌ టెక్నాలజీ (డ్రెస్‌మేకింగ్‌) వంటికి కూడా ఉన్నాయి. గతంలో విద్యార్థికి ఐచ్చికంగా అప్రెంటిస్‌ షిప్‌ ఉండేది. ఇప్పుడు దీన్ని తప్పనిసరి చేశారు. ఆయా ట్రేడ్‌లకు సంబంధించిన రంగాల్లోని సంస్థల్లో అప్రెంటీ్‌సలో చేరితో ఆ పరిశ్రమలే విద్యార్థి పనితీరు, నైపుణ్యాలు, క్రమశిక్షణ వంటి అంశాలు పరిశీలించి గ్రేడులు ఇస్తున్నాయి. ఐటీఐ కళాశాల కన్వీనర్‌ ఎనసీవీటికి పంపిస్తే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ (డీజీటీ) గుర్తింపు ధ్రువపత్రం వస్తుంది. వీటిపై అవగాహన కల్పిస్తే సీట్లను భర్తీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


దరఖాస్తులు ఆహ్వానం


జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీకి రెండో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్‌ కె.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆనలైనలో ఐటీఐ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన వెబ్‌సైట్‌ నుంచి తమ దరఖాస్తును రిజిస్టర్‌ చేసుకుని, వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింకుద్వారా కళాశాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అభ్యర్థులకు సందేహాలుంటే సమీపంలోని ఐటీఐ కళాశాలల్లో సంప్రదించాలన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో చేరదలుచుకున్న ఐటీఐ కళాశాలలో ఈ నెల 25వ తేదీ లోపల సర్టిఫికెట్లను ధ్రువీకరించుకోవాలని తెలిపారు. 29న ప్రభుత్వ, 30న ప్రైవేటు ఐటీఐలలో కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఐటీఐ పూర్తిచేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. తల్లిదండ్రులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. 

Updated Date - 2022-08-20T04:47:50+05:30 IST