విద్యార్థిని వైద్యఖర్చులకు సాయం

ABN , First Publish Date - 2022-08-19T03:24:51+05:30 IST

ఓ విద్యార్థిని వైద్య ఖర్చులకు రూ, 14,000ల సాయమందించి మానవత్వం చాటుకున్నారు బెస్ట్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు.

విద్యార్థిని వైద్యఖర్చులకు సాయం
: ఆర్థిక సాయమందిస్తున్న బెస్ట్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

కావలిటౌన్‌, ఆగస్టు18: ఓ విద్యార్థిని వైద్య ఖర్చులకు రూ, 14,000ల సాయమందించి మానవత్వం చాటుకున్నారు బెస్ట్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు. స్థానిక పాతూరు అరటితోటకు చెందిన విద్యార్ధిని సుకన్య కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట శేషయ్య సభ్యులతో కలిసి గురువారం సుకన్య నివాసానికి వెళ్లి రూ. 14,000 నగదు అందించారు. శేషయ్య మాట్లాడుతూ  తమ అసోసియేషన్‌ సభ్యులు సర్ధార్‌ కిర్మాణి మరికొంతమంది సభ్యుల సహకారంతో ఈ  సాయం అందించామన్నారు. 


Updated Date - 2022-08-19T03:24:51+05:30 IST