Advertisement

‘జీసీసీ’లో నిధుల అవకతవకలపై విజిలెన్స విచారణ

Sep 16 2020 @ 01:27AM

భద్రాచలం, సెప్టెంబరు 15: భద్రాచలంలోని జీసీసీ కార్యాలయంలో నిధుల అవకతవకలపై మంగళవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన  విజిలెన్స్‌ అధికారి రోజారాణి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురిని విచారించారు. ఇక్కడ పని చేస్తున్న అకౌంటెంట్‌ 2018లో ట్రాన్స్‌పోర్టు చెల్లింపులకు సంబంధించి రూ.50వేల లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పుడు విచారణ నిర్వహించి శాఖపరమైన చర్యలకు ఉన్నతాదికారులకు సిఫార్సు చేసినా నోటీసుతోనే సరిపెట్టినట్లు తెలుస్తోంది.


తాజాగా నాలుగు నెలల క్రితం మరోసారి రూ.30వేల నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గోదాం ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఉద్యోగి ఈ విషయమై ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌తో పాటు జీసీసీ ఎండీ, డీ ఎం, బీఎంలకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదారాబాద్‌లోని జీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి విజిలెన్స్‌ అఽధికారి రోజారాణి భద్రాచలం వచ్చి కార్యాలయంలో విచారణ నిర్వహించడంతో పాటు ఇందుకు సంబంధించిన రికార్డులను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారించి శాఖపరంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us on:
Advertisement
Advertisement