మున్సిపల్‌ ఉద్యోగాల భర్తీపై విజిలెన్స్‌

ABN , First Publish Date - 2022-05-26T07:09:57+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా దుమారం రే పుతున్న నిర్మల్‌ పురపాలక సంఘం పారిశుఽధ్య కార్మికుల ని యామక ప్రక్రియపై విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది.

మున్సిపల్‌ ఉద్యోగాల భర్తీపై విజిలెన్స్‌
నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయం

పారిశుధ్య పోస్టుల భర్తీ ప్రక్రియపై ఉన్నతాధికారుల నిఘా

జీతాలు నిలిపివేయాలని ట్రెజరీశాఖకు డైరెక్టర్‌ ఆదేశాలు 

జీతాలు చెల్లించాలని డీటీఓపై పెరుగుతున్న ఒత్తిళ్లు

స్పష్టమైన సమాచారం ఇచ్చేందుకు డీటీఓ విముఖత 

అధికారుల సెలవుపైనా ఆరా

నిర్మల్‌, మే 25(ఆంధ్రజ్యోతి) :  రాష్ట్రవ్యాప్తంగా దుమారం రే పుతున్న నిర్మల్‌ పురపాలక సంఘం పారిశుఽధ్య కార్మికుల ని యామక ప్రక్రియపై విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు ఆంధ్రజ్యోతికి సమాచారం అందించాయి. మరోవైపు కొందరు నిరుద్యోగులు ఉన్న తాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ఈ నియామకాల ప్రక్రి యను రద్దుచేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉపాధికల్పనశాఖ అధికారులు సైతం ఈ భర్తీ ప్రక్రియను పూర్తిగా తప్పుబట్టినట్లు తెలుస్తోంది. ఆ అధికారులు తమ ప్రమేయం లేకుండా ఇష్టారీతిన భర్తీ ప్రక్రియ చేశారని, తాము ఇచ్చిన సీనియార్టీ జాబితాకు సంబంధించి ఇప్పటి దాక తమకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మున్సిపల్‌ యంత్రాంగం అందిం చలేదని నివేదించినట్లు తెలిసింది. 

రంగంలోకి విజిలెన్స్‌

పారిశుధ్య కార్మికుల పోస్టుల భర్తీపై విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ఉపాధి కల్పన శాఖ ఎన్ని సార్లు లేఖలు రాసినా మున్సిపల్‌, ట్రెజరీశాఖల నుంచి సమాచారం ఇవ్వకపోగా, నేరుగా ఉద్యోగుల ఐడీనంబర్‌లను ఇచ్చిన ట్రెజరీ అధికారులు మూడు నెలల పాటు జీతాలు కూడా విడుదల చేసినట్లు ప్రచారం ఉంది. అయితే తాజా వివాదం నేపథ్యంలో విజిలెన్స్‌ నివేదికలు వచ్చే వరకు కొత్తగా ఎంపిక చేసిన పారిశుధ్య కా ర్మికులకు జీతాలు నిలిపివేయాలని ట్రేజరీ శాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం జిల్లా ట్రెజరీ శాఖ అధికారిని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివాదం ముగిసేంత వరకు ఎవరికి కూడా జీతాలు ఇవ్వవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే జీతాలు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ శాఖ అధికారిపై స్థానికనేతలు ఒత్తిడి పెం చుతున్నారని తెలిసింది. ఓ సీనియర్‌ ప్రజా ప్రతినిధితో పాటు మున్సిపల్‌ పాలకవర్గం అగ్రనేతలతో ఒత్తిడిలు పెట్టిస్తున్నట్లు ప్రచా రం ఉంది. అయితే ఈ విషయమై జిల్లా ట్రెజరీ అధికారి ప్రభాకర్‌ రావును వివరణ కోరగా ప్రస్తుతానికి జీతాలు ఇచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గతంలో ఇచ్చిన జీతాల విషయమై అడిగితే ఆయన దాటవేశారు. తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. అయితే ఆయన స్పష్టమైన జవాబు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు.   

అధికారుల సెలవుపైనా ఆరా

పురపాలకశాఖ పారిశుధ్య కార్మికుల నియామకాల వ్యవహారం అత్యం త వివాదాస్పదమైన నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి బదిలీపై వెళ్లారన్న ప్రచారం అనేక అనుమానాలకు తావునిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇక్కడి నుంచి సెలవుపై వెళ్లిపోగా తాజాగా సూర్యాపేట్‌లో పోస్టింగ్‌ పొందారు. అలాగే ఇన్‌చార్జీ సానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌ మురారిని కూడా బలవంతపు సెలవుపై పంపినట్లు అధికారవర్గాల్లో గుసగుసలున్నాయి. ఈ వ్యవహారంలో ఆయన పాత్రనే కీలకం అని అధి కార వర్గాల్లో ప్రచారం ఉంది. ఆయన ఆకస్మికంగా సెలవుపై వెళ్ళిపోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్‌, సానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌ సెలవుపై వెళ్ళిన విషయంపై కూడా విజిలెన్స్‌ అధికారులు విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-05-26T07:09:57+05:30 IST