రేషన్‌ షాపులపై విజిలెన్స్‌ దాడులు

Jun 17 2021 @ 00:25AM
జానంపేటలో రేషన్‌ షాపులని తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

 గుడ్లూరు, జూన్‌ 16 : మండలంలోని జానకంపేట, చినలాటవరపి గ్రామాల్లో  రెండు రేషన్‌ షాపులపై జిల్లా విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం...  జానకంపేట 9 వ నెంబర్‌ రేషన్‌ షాపులో నిల్వ ఉండాల్సిన 39 బస్తాల రేషన్‌ బియ్యం కనిపించకుండా పోయాయని, అదే షాపులో మరో 50 ప్యాకెట్లు పంచాల్సిన చక్కెర, అలాగే 10 ప్యాకెట్ల కందిపప్పు పంచకుండా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా చినలాటవరపిలోని 10 వ నెంబర్‌ రేషన్‌ రేషన్‌ షాపులో 8 బస్తాల రేషన్‌ బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా అవి కనిపించకుండా మాయం అయ్యాయి. అదే షాపులో వినియోగదారులకు అందించాల్సిన 23 ప్యాకెట్ల చక్కెర కూడా నిల్వ ఉన్నట్లు ఈ సందర్బంగా విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో బయటపడ్డాయి. ఈ మేరకు రెండు షాపులకు చెందిన రేషన్‌  డీలర్లు కృష్ణవేణి, సౌమ్యలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనీఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్ధార్‌ ఎస్‌. రామనారాయణరెడ్డి, ఎస్సై నాగేశ్వరరావు, సిబ్బంది ఫాల్‌స్యామ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.