ఆ గ్రామంలో సగం మందికి కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2021-04-23T17:20:35+05:30 IST

మహానగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు పాజిటివ్‌ ప్రబలింది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అబనహళ్ళిలో క

ఆ గ్రామంలో సగం మందికి కరోనా వైరస్‌

- పల్లెలకూ తాకిన పాజిటివ్‌... 

- బెళగావి జిల్లాలో ఓ గ్రామం సీల్‌డౌన్‌


బెంగళూరు: మహానగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు పాజిటివ్‌ ప్రబలింది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అబనహళ్ళిలో కరోనా నమోదులు చూస్తే బెంబేలెత్తాల్సిందే. అమనహళ్ళిలో 300 మంది జనాభా ఉన్నారు. ఇటీవల ఈ గ్రామంలో పలువురికి పాజిటివ్‌ రావడంతో గ్రామంలోని అందరికీ పరీక్షలు జరిపించారు. వీరిలో 144 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ అయింది. గ్రామంలో సగం మందికి  కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్టు అయింది. దీంతో బెళగావి జిల్లా యంత్రాంగం ఖంగుతింది. బాధితులందరినీ అందుబాటులో ఉండే ఆస్పత్రులకు చేర్పించారు. గ్రామాన్ని పూర్తిగా సీల్‌డౌన్‌ చేశారు. రాష్ట్రంలో రెండో విడదత కొవిడ్‌ ప్రబలిన తర్వాత గ్రామం మొత్తం సీల్‌డౌన్‌ కావడం ఇదే తొలిసారి. గ్రా మంలోని ప్రతి కుటుంబానికి చెందినవారు గోవా, మహారాష్ట్రలకు కూలీ పనులకు వెళ్తుంటారు. రెండు రాష్ట్రాల్లోనూ కొవిడ్‌ తీవ్రం కావడంతో ఈ నెల 10వ తేదీన దాదాపు అందరూ గ్రామానికి వాపసు వచ్చారు. తొలుత ముగ్గురు పరీక్షించుకోగా వారికి కొవిడ్‌ రావడంతో ఆ తర్వాత లక్షణాలు తీవ్రం కావడంతో అందరూ పరీక్షలు చేయించుకున్నారు. 


Updated Date - 2021-04-23T17:20:35+05:30 IST