హీరోగా దర్శకుడు K.Vijaya Bhaskar తనయుడు

Published: Sun, 29 May 2022 10:08:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హీరోగా దర్శకుడు K.Vijaya Bhaskar తనయుడు

సురేశ్ (Suresh) హీరోగా నటించిన ‘ప్రార్థన’ (Prarthana) చిత్రంతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు కె. విజయభాస్కర్ ( K.Vijaya Bhaskar). తొలి ప్రయత్నం అంతగా సక్సెస్ కాలేదు. అయితే దాదాపు ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత ‘స్వయంవరం’ (Swayamvaram) చిత్రంతో మళ్ళీ దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చి.. హీరోగా తొట్టెంపూడి వేణు (Tottempudi Venu)ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఇదే సినిమాతో మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కూడా పరిచయం అయ్యారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఆ తర్వాత విజయ్ భాస్కర్ తీసిన ‘నువ్వే కావాలి, నువు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి’ లాంటి చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. చిరంజీవి (Chiranjeevi) హీరోగా వచ్చిన ‘జై చిరంజీవా’ (Jai chiranjeeva) పర్వాలేదనిపించుకుంది. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడవడంతో.. విజయ్ భాస్కర్ ఆస్థాన రైటర్ మారాడు. సినిమాలు కూడా అంతగా మ్యాజిక్ చేయలేకపోయాయి. విజయ్ భాస్కర్ ఆఖరుగా తీసిన చిత్రం వెంకీ, రామ్‌ల ‘మసాలా’. ఈ సినిమా అంతగా ఆడలేదు. 


ప్రస్తుతం విజయ్ భాస్కర్ తన తనయుడు కమల్‌ (Kamal) ను హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇతడికి చిన్నప్పటినుంచి సినిమాలంటే ఇష్టం. చదువుకొనే రోజుల్నుంచి సినిమాల్లో నటించాలనుకునేవాడు. యాక్టింగ్ లో కొన్ని మెళకువలు నేర్చుకున్నాడు కమల్. నిజానికి కరోనాకి ముందే కమల్ ఎంట్రీ ఉండాలి. అయితే కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కమల్ హీరోగా సినిమా ఖాయమైంది. కథానాయికగా రాజశేఖర్ కుమార్తె శివానీ (Shivani)  ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రాబోతోంది. మరి ఈ సినిమాకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తారా లేక వేరే దర్శకుడు తెరకెక్కిస్తాడా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరి హీరోగా కమల్ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International