
విజయ్ దేవర కొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే(Ananya Panday) హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. విజయ్ ఆ పోస్టర్లో నగ్నంగా దర్శనమిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్కు దాదాపుగా 1.36మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో తెలుగు సినిమాల్లో కొంత మంది నటులు నగ్నంగా దర్శనమిచ్చారు. అలా కనిపించిన నటులపై ఓ లుక్కేద్దామా..

‘ఈగ’ లో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep in Eega):
దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ‘ఈగ’. ఈ చిత్రంలోని ఓ సీన్ కోసం కిచ్చా సుదీప్ శరీరం మీద నూలుపోగు లేకుండా నటించాడు.

‘బాయ్స్’ లో సిద్దార్థ్ (Siddharth in Boys):
శంకర్ తెరకెక్కించిన సినిమా ‘బాయ్స్’. తెలుగు, తమిళ్ బై లింగ్విల్‌గా రూపొందించారు. జెనీలియా హీరోయిన్గా నటించిది. మూవీలో ఆమెపై ప్రేమను నిరూపించుకోవడానికి సిద్దార్థ్ నగ్నంగా రోడ్డును దాటుతాడు.

‘ఆపరేషన్ దుర్యోధన’ లో శ్రీకాంత్ (Srikanth in Operation Duryodhana):
పోసాని కృష్ణమురళి డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఆపరేషన్ దుర్యోధన’. శ్రీకాంత్ హీరోగా నటించాడు. ఓ సీన్లో శ్రీకాంత్ న్యూడ్‌గా దర్శనమిచ్చాడు.

‘ఒంగోలు గిత్త’ లో ప్రకాష్ రాజ్ (Prakash Raj in Ongole Gittha):
బాస్కర్ తెరకెక్కించిన సినిమా ‘ఒంగోలు గిత్త’. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంగా రూపొందించారు. ఈ సినిమాలో ఓ సీన్లో ప్రకాష్ రాజ్ శరీరం మీద నూలు పోగు లేకుండా కనిపించాడు.

‘నాంది’ లో అల్లరి నరేష్ (Allari Naresh in Naandhi):
అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘నాంది’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో జైలు సీన్లో నరేష్ నగ్నంగా నటించాడు.

‘క్యాలీఫ్లవర్’ లో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu in Cauliflower)
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన సినిమా ‘క్యాలీ ఫ్లవర్’. ఈ సినిమా పోస్టర్‌ను అప్పట్లో వెరైటీగా డిజైన్ చేశారు. న్యూడ్ లుక్‌తో సోషల్ మీడియాలో విడుదల చేశారు.