Vijay Deverakonda: కరణ్ జోహార్ షో మీద రౌడీ హీరో అసంతృప్తి.. కారణం ఏంటంటే..

Published: Tue, 09 Aug 2022 17:24:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Vijay Deverakonda: కరణ్ జోహార్ షో మీద రౌడీ హీరో అసంతృప్తి.. కారణం ఏంటంటే..

ఎటువంటి అంచనాలు లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. స్టార్‌డమ్ సంపాదించిన నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారిన ఈ యువ నటుడు ‘అర్జున్ రెడ్డి(Arjun Reddy)’ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాతో తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. అందులో పలువురు బాలీవుడ్ అందాల భామలు కూడా ఉన్నారు. వారిలో సారా అలీఖాన్(Sara Ali Khan), జాన్వీకపూర్ (Janhvi Kapoor) ముఖ్యులు. ఈ బ్యూటీస్ ఇద్దరూ ఇటీవలే ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’కి అతిథులుగా వచ్చారు.


బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందులో.. ‘ఎవరితో డేటింగ్ చేయాలని ఉంది?’ సారాని అడిగాడు కరణ్. దానికి సారా మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ అని చెప్పింది. అదే సమయంలో.. జాన్వీ సైతం విజయ్ అంటే ఇంట్రాస్టింగ్‌ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే కరణ్ పలుమార్లు విజయ్‌ని ఛీజ్‌తో పోల్చాడు.


అనంతరం.. విజయ్ సైతం అనన్య పాండేతో కలిసి లైగర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కరణ్ షోకి గెస్టులుగా వచ్చారు. అందులో సైతం సారా, జాన్వీ సంభాషణ‌ని ప్రస్తావిస్తూ.. ఛీజ్ గురించి మాట్లాడాడు కరణ్. దాంతో విజయ్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. అప్పటినుంచి ఎక్కడికి వెళ్లిన దానికి గురించి అందరూ మాట్లాడుతున్నారు. తాజాగా సైతం ముంబైలోని ఓ చోట మీడియా కంటపడ్డాడు విజయ్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రిపోర్టర్స్ ‘విజయ్ అన్న.. మీకు ఛీజ్ కావాలా’ అంటూ అడిగారు. కానీ.. అది అంతగా నచ్చని విజయ్ ఏదో అనుకుంటూ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కరణ్ కామెంట్స్ విజయ్‌కి నచ్చలేదు అనుకుంటా, కరణ్ మీద విజయ్‌కి చాలా కోపం ఉన్నట్లు ఉంది అంటూ వరుసగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...