ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి..?

Jun 15 2021 @ 10:30AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న ఓ పాన్ ఇండియన్ సినిమాకి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్' తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇదివరుకే మేకర్స్ ప్రకటించారు. దీని తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియన్ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. మేకర్స్ నుంచి త్వరలో ఇందుకు సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివతో ప్రాజెక్ట్ మొదలవనుంది. వీటి తర్వాత ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్ ఉంటుంది.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.