దళపతి విజయ్ తెలుగు సినిమా లాంచింగ్ అప్పుడేనా?

Published: Fri, 28 Jan 2022 12:25:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దళపతి విజయ్ తెలుగు సినిమా లాంచింగ్ అప్పుడేనా?

తమిళ దళపతి విజయ్ తెలుగులో ఓ స్ట్రైట్ మూవీకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సినిమా నిర్మాణం జరుపుకోనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్..  అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులవుతున్నా.. ఇంత వరకూ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్టేడ్ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా హడావిడిలో ఉన్న విజయ్.. వచ్చే నెల్లో ఈ సినిమా డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి చిత్రానికే డేట్స్ కేటాయించబోతున్నట్టు సమాచారం. 


తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. సినిమాకు వచ్చే నెల్లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిపి.. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎర్లియర్ గా ‘మాస్టర్’  మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన విజయ్.. ఈ సినిమాతో ఏ స్థాయి హిట్ అందుకుంటాడో చూడాలి.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International