వైభవంగా విజయ దశమి

ABN , First Publish Date - 2021-10-17T04:36:16+05:30 IST

ఆశ్వయిజ శుద్ధ పాడ్య మి నుంచి తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్స వాలను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్న ప్రజలు శుక్రవారం విజయదశమి పర్వదినాన్ని వైభవంగా జరపుకున్నారు.

వైభవంగా విజయ దశమి
జమ్మి ఆకును తెంచుతున్న ఎమ్మెల్యే

- ఆలయాల్లో భక్తుల రద్దీ

- పూజల్లో ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్మన్‌

- శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు

గద్వాల టౌన్‌, అక్టోబరు 16: ఆశ్వయిజ శుద్ధ పాడ్య మి నుంచి తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్స వాలను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్న ప్రజలు శుక్రవారం విజయదశమి పర్వదినాన్ని వైభవంగా జరపుకున్నారు. గతేడాది కరోనా కారణంగా ధార్మిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ ఏ డాది అందుకు భిన్నంగా అధికసంఖ్యలో దసరా ఉత్సవా ల్లో పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని ఆలయాలు భక్తుల తో కిటకిటలాడాయి.  మునిసిల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ పట్టణంలోని షిరిడీ సాయిబాబా మందిరంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. కుమ్మరి శాలివాహన సంఘం, బాలాజీవీధి, రాంనగర్‌ వీధుల్లో మండపాలు ఏర్పాటుచేసి అమ్మవారిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించిన భక్తులు పదవరోజు అ మ్మవారి విగ్రహాలను ఊరేగించారు. కన్యకాపరమేశ్వర ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తితో రథోత్సవా న్ని ఆర్యవైశ్యులు గుండు చెన్నకేశవ స్వామి ఆలయం వరకు చేరి అక్కడి శమీ వృక్షానికి పూజలు నిర్వహిం చారు. దసరా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బీ.ఎస్‌. కేశవ్‌లు కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం  ప్రతియేటా గుండు చెన్నకేశవస్వామి ఆలయంలో జరిగే శమీ వృక్ష పూజోత్సవంలో పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే 

 కేటీదొడ్డి: దసరా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం మండలంలోని  లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శిచుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి వెంకటాపురం గ్రామంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ చైర్మన్‌ వెం ట్రామిరెడ్డి, ఆలయ ఈవో పురేందర్‌కుమార్‌  , జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ఎంపీపీ రామకృష్ణనాయుడు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హన్మం తు, పార్టీ మండల అధ్యక్షుడు ఉరుకుందు, ఆయా గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్య కర్తలు ఉన్నారు. 

 ఉండవల్లి మండలంలో..

ఉండవల్లి: దసరా పండగను పురస్కరించుకొని శుక్రవారం ఉండవల్లి, కంచుపాడు, తక్కశీల, ప్రాగటూర్‌, శేరుపల్లి తదితర గ్రామాల్లో శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలో రైతుసంఘం ఆధ్వర్యంలో ముందుగా చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి  శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనసూయమ్మ కాలనీ, శేరుపల్లి, కంచుపాడు గ్రామాల్లో ప్రతిష్టించిన దుర్గమ్మ విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. 

మల్దకల్‌ మండలంలో..

మల్దకల్‌: విజయానికి ప్రతీకగా భావించే విజయదశమి పండుగను మల్దకల్‌ మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం, వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. శమీ వృక్షానికి ఆలయ అర్చకులు మదుసూధనాచార్యులు, రమేశాచార్యులు, రవిఆచార్యులు, ధీరేంద్రదాసుల ఆధ్వర్యంలో పూజలు చేశారు.  పల్లకీ సేవ నిర్వహించారు.  కార్యక్రమంలో  ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మానవపాడు మండలంలో..

మానవపాడు: మండల పరిధిలోని చెన్నిపాడు గ్రా మంలోని దళితవాడలో చెన్నకేశవయూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి నిమజ్జనంతో ఘనంగా ముగిశాయి.  అంతకు ముందు అమ్మవారి పట్టువస్ర్తాలను వేలం వేశారు. అత్యధికంగా రూ. 23వేలకు గోపాల్‌నాయుడు కుమారుడు వెంకటేశ్వర్లు దక్కించుకున్నారు. తొమ్మిదిచీరలకు, కలశంకు గాను ఉత్సవ కమిటీకి రూ. 85,200 ఆదాయం వచ్చినట్లు  నిర్వాహకులు తెలిపారు. ఆనంతరం దళితవాడ నుంచి ప్రారంభమయిన శోభయాత్ర నాలుగుగంటలపాటు కొనసాగింది. అమ్మవారి విగ్రహాం ముందు నృత్య కళాకారుడు రమేష్‌మాల ఆధ్వర్యంలో  మహిళలు  బతుకమ్మపాటకు కోలాటం ఆడారు. బొడ్డెమ్మలు వేశారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కృష్ణనదిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. అలాగే మండల కేంద్రంలో ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ఊరేగిస్తూ వీధులగుండా బతుకమ్మ పాటలకు నృత్యలు చేశారు.



Updated Date - 2021-10-17T04:36:16+05:30 IST