రావణ వధకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-10-25T07:39:12+05:30 IST

మండలంలో విజయదశమి వేడుకల్లో భాగంగా కాటారంతో పాటు అదే గ్రామపంచాయతీ పరిధిలోని గారెపల్లిలో రావణాసుర వధ కోసం ఏర్పాట్లు చేశారు

రావణ వధకు ఏర్పాట్లు పూర్తి

కాటారం, అక్టోబరు 24: మండలంలో విజయదశమి వేడుకల్లో భాగంగా కాటారంతో పాటు అదే గ్రామపంచాయతీ పరిధిలోని గారెపల్లిలో రావణాసుర వధ కోసం ఏర్పాట్లు చేశారు. భారీ సైజులో రావణాసురుడి విగ్రహాలను ఏర్పాటు చేసి బాణసంచాతో కాల్చ డానికి చర్యలు చేపట్టారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి  ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సర్పంచ్‌ రాధమ్మ తెలిపారు. కాటారంలో ఏర్పాట్లను సర్పంచ్‌ తోట రాధ మ్మ, ఎంపీటీసీ తోట జనార్దన్‌, ఉప సర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌, వార్డు సభ్యులు గోనె శ్రీనివాస్‌, లక్ష్మణ్‌గౌడ్‌, శ్రావణ్‌ శనివారం పర్యవేక్షించారు.

Updated Date - 2020-10-25T07:39:12+05:30 IST