వైభవంగా విజయదశమి సంబరాలు

ABN , First Publish Date - 2021-10-17T06:59:55+05:30 IST

మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలను భక్తులు శుక్రవారం వైభవంగా జరుపుకున్నారు.

వైభవంగా విజయదశమి సంబరాలు
ఉలవపాడులో గ్రామోత్సవం

దర్శి, అక్టోబరు 16 : మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలను భక్తులు శుక్రవారం వైభవంగా జరుపుకున్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు దేవాలయాలకు వెళ్లి అర్చకులు నిర్వహిం చిన ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. దొనకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్ధానిక కనకదుర్గమ్మ గుడిలో, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో, పోలేరమ్మ గుడిలో, దద్దాలమ్మగుడిలో అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చి  భక్తుల పూజలందుకున్నారు. 

పామూరు : స్థానిక వాసవిమాత దేవస్థానంలో  దేవి నవరాత్రి వేడుకలు శనివారం ఏకాదశి ఉభయంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. శుక్రవారం దశమి ఉభయం సందర్భంగా వాసవి మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్‌కు కమిటీ సభ్యులు బంగారు చీరను అలంకరించారు. కార్యక్రమంలో దేవస్ధాన గౌరవ ఽఅధ్యక్షులు మణికంఠస్వామి, కమిటీ అధ్యక్షుడు వై బాలకొండలరావు, కిష్టయ్య, దరిశి మస్తాన్‌రావు, వైవీ.సాయికిరణ్‌, డీవీ.మనోహర్‌,  డీ.రాము, డీవీకే సుబ్బారావు, గోస్టు రామారావు, మంచికంటి సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం, మహిళ సంఘం, యువజన, బాలానగరం, వాసవీక్లబ్‌ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

తాళ్లూరు : దసరా సందర్భంగా తాళ్లూరులోని పార్వతీ సమేతరామలింగేశ్వరస్వామి, రుక్ష్మిణీ సమేత వేణుగోపాలస్వామిఆలయాల వద్ద దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరిగాయి. దశమి సందర్భంగా శమి వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. పురవీధుల్లో స్వాముల నగరయాత్ర నిర్వహించారు. బొద్దికూరపాడు, తూర్పుగంగవరం, మాధవరం, లక్కవరం, శివరాంపురం,తదితర గ్రామాల్లో ఆలయాలవద్ద దుర్గామాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్సై ఆద్వర్యంలో ఆయుదపూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైఎస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి,సూళ్లురుపేట సీఐ ఐ.వెంకటేశ్వరరెడ్డి, పారిశ్రామికవేత్త ఐ.వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ కోటరామిరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, కోట క్రిష్ణారెడ్డి, తదితరులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

లింగసముద్రం :విజయదశమి సందర్బంగా లింగసముద్రం, వాకమళ్లవారిపాలెం, తిమ్మారెడ్డిపాలెం, మొగిలిచెర్ల, నపవని, పెదపవని, వీఆర్‌ కోట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. అలాగే లింగసముద్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను గ్రామంలో ఊరేగించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరిదేవి రూపంలో ప్రజలకు దర్శనమిచ్చారు. లింగసముద్రం పంచాయతీలోని వాకమళ్ళవారిపాలెంలో దుర్గాదేవి అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు.

ముండ్లమూరు : మండలంలోని ఈదర గ్రామంలో దసరా ఉత్సవాల్లో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విశేష పూజలుచేశారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సింగనపాలెంలో పోలేరమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ సూదిదేవర అంజయ్య, ఎంపీటీసీ సభ్యులు బంకా రమణమ్మ నాగిరెడ్డి, అంబన అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ఉలవపాడు, అక్టోబరు 16 : నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని గ్రామదేవతల విజయదశమి ఉత్సవాలను భక్తులు వైభవంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ అంకమ్మతల్లి, శ్రీ కనకదుర్గమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.   కరేడు గ్రామంలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి పారువేట కార్యక్రమం అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.  



Updated Date - 2021-10-17T06:59:55+05:30 IST