అశోకుడి అభివృద్ధికి చిహ్నమే విజయదశమి

ABN , First Publish Date - 2021-10-17T05:22:18+05:30 IST

భారతదేశంలో అశోక చక్రవర్తి చేసిన అభివృద్ధికి ప్రతిరూపమే విజయదశమి పండుగ వచ్చిందని బౌద్ధ భిక్షువు సద్ద రక్కిత అన్నారు.

అశోకుడి అభివృద్ధికి చిహ్నమే విజయదశమి
బౌద్ధ భిక్షువు సద్ద రక్కిత

- బౌద్ధ భిక్షువు సద్ద రక్కిత 


పాలమూరు, అక్టోబరు 16 : భారతదేశంలో అశోక చక్రవర్తి చేసిన అభివృద్ధికి ప్రతిరూపమే విజయదశమి పండుగ వచ్చిందని బౌద్ధ భిక్షువు సద్ద రక్కిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో అశోకుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆది లక్ష్మయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అఖండ భారతంలో అశోకుడు కలింగ యుద్ధం తరువాత లక్షలాది మంది మరణాని చూసి పశ్చాత్తాపం చెందాడన్నారు. అప్పుడు అక్కడే ఉన్న బౌద్ధభిక్షువు యుద్ధ ధర్మం బోధించారని, రణరంగంలో రెండు వైపులా ప్రాణ నష్టం జరుగుతుందని, ప్రజలు దుఃఖానికి గురవుతారని, నీవే మారాల్సిన అవసరం ఉందని అశోకుడికి బోధించారని తెలిపారు. నేను అనే అహం విడనాడి రాజ్య కాంక్షనుంచి బయటపడాలని చెప్పారని పేర్కొన్నారు. అశోకుడు ఆ రోజు నుంచి ఆయుధాలను విడనాడుతున్నానని ఆ భిక్షువు కాళ్లమీద ఆయుధాలను పెట్టి ఇకముందు నేను బతికినంతకాలం నా వంశం వాళ్లు ఆయుధాలు చేపట్టబోమని శపథం చేసి బౌద్ధదమ్మాన్ని స్వీకరించారని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి అశోకుడు బుద్ధుడు చెప్పిన ధర్మాలను పాటిస్తూ, యుద్ధ ఖైదీలను విడుదల చేయటం, రహదారులు నిర్మించటం, చెట్లు నాటటం, బావులు తవ్వటం, దేశంలో మొదటిసారి పశువైద్యశాలను ప్రారంభించారని వివరించారు. అది లక్ష్మయ్య, మల్లెపోగు ప్రవీణ్‌ మాట్లాడుతూ పది రోజుల విజయదశమిలో పది కార్యక్రమాలు చేసిన అశోకుని చరిత్రను వక్రీకరించారని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కార్యక్ర మంలో బాలపీరు, రాయికంటి రాందాసు, పరమేశ్వర్‌, రాములమ్మ, రమేష్‌, గోపాల్‌, పాషా, రహీమ్‌, ఎల్‌.రమేష్‌, బుర్రన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:22:18+05:30 IST