విజయనగరంలో కళాకారుల నిరసన
ABN , First Publish Date - 2022-01-19T18:12:27+05:30 IST
చింతామణి నాటక నిషేధంపై కళాకారులు భగ్గుమంటున్నారు.
విజయనగరం: చింతామణి నాటక నిషేధంపై కళాకారులు భగ్గుమంటున్నారు. బుధవారం కలెక్టరేట్ దగ్గర కళాకారులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వందేళ్ల చింతామణి నాటకానికి ప్రభుత్వం సంకెళ్లు వేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో తమ పొట్టకొడుతున్నారని రంగస్ధల కళాకారుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.