విజయనగరం: నగరంలోని ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ దగ్గర వైసీపీ వైఖరికి నిరసనగా టీడీపీ, జనసేన ఆందోళనకు దిగింది. సినిమా టిక్కెట్లు ఎమ్మెల్యే వీరభధ్రస్వామి, ఆయన అల్లుడు కౌసిక్ తీసుకువెళ్లి వైసీపీ నాయకులకు అందిస్తే... వారు బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆందోళనకు చేపట్టారు. వైసీపీ నాయకులు బ్లాక్ టిక్కెట్లు అమ్ముకోవటం సిగ్గుచేటని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు మండిపడ్డారు. వైసీపీ నాయకులు బ్లాక్లో టిక్కెట్లు అమ్మటం అధికారులకు కనిపించటం లేదా అంటూ జనసేన నేత బాలు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి